Darsi: దర్శిలో రూ.35 లక్షలతో 2 MLD మైక్రో ఫిల్టర్స్ ప్రారంభం
Darsi: దర్శి NAP చెరువు వద్ద రూ.35 లక్షలతో ఆర్డబ్ల్యూఎస్ కింద ఏర్పాటు చేసిన 2 MLD మైక్రో ఫిల్టర్స్‌ను టీడీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రారంభించారు.
Darsi: దర్శిలో రూ.35 లక్షలతో 2 MLD మైక్రో ఫిల్టర్స్ ప్రారంభం
Darsi: దర్శి పట్టణం లోని NAP చెరువు వద్ద గ్రామీన ప్రజలకు మెరుగైన, స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీటిని అందించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ దర్శి రక్షిత మంచినీటి పథకం కింద రు. 35 లక్షల రూపాయలతో నూతన ఏర్పాటు చేసిన 2 MLD మైక్రో ఫిల్టర్స్ ని ప్రారంభించిన దర్శి టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు.
ప్రతి ఇంటికీ తాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ప్రజల అవసరాలకు అనుగుణంగా నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ తెలియజేశారు.
ఈ కార్యక్రమం లో దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి ఏఎంసి చైర్మన్ దారం నాగవేణి - సుబ్బారావు, RWS DE కె. శ్రీనివాసరావు, AE ఎ హనుమాన్ బాబు అధికారులు, దర్శి మండల టిడిపి నాయకులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.




