Markapuram: కలెక్టర్‌కు దళిత హక్కుల సమితి వినతి!
Markapuram: మార్కాపురం జిల్లా ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ ఓటర్లను బెదిరిస్తే అట్రాసిటీ కేసులు పెట్టాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి నేత నాగేంద్రరావు కోరారు.
Markapuram: కలెక్టర్‌కు దళిత హక్కుల సమితి వినతి!
Markapuram: మార్కాపురం జిల్లాలో మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకున్నా, ఓటర్లను బెదిరించినా, దౌర్జన్యాలకు పాల్పడినా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం కేసులు నమోదు చేయాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు డిమాండ్ చేశారు.
శుక్రవారం మార్కాపురం కలెక్టరేట్ ఎదుట ఎస్సీ, ఎస్టీల ఓటు హక్కు–చట్టంపై రూపొందించిన గోడపత్రికను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ విజయ సునీత, జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులను కలిసి సంబంధిత చట్ట నిబంధనలను వివరించి గోడపత్రిక, చట్ట ప్రతులను అందజేశారు.
ఎస్సీ, ఎస్టీలను తమకు నచ్చిన పార్టీకి ఓటు వేయాలని బెదిరించడం, ఓటు హక్కును అడ్డుకోవడం, ఎన్నికల అనంతరం సామాజిక బహిష్కరణకు పాల్పడటం చట్టరీత్యా నేరమని తెలిపారు. బాధితులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.85 వేల వరకు పరిహారం అందే అవకాశం ఉందన్నారు.
ఫిర్యాదులపై పోలీసులు తప్పనిసరిగా కేసులు నమోదు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు ధార అంజయ్య, కాకుమాను రవి, దామవరపు నాగసాయి, దేవరపల్లి గోపి తదితరులు పాల్గొన్నారు.




