Cumbum: ఎస్.వి.కె.పి. డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ‘నిషా ముక్త్ భారత్’ ర్యాలీ

Cumbum: కంభం ఎస్.వి.కె.పి. డిగ్రీ కళాశాల NSS ఆధ్వర్యంలో 'నిషా ముక్త్ భారత్' అవగాహన ర్యాలీ. మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని ఎన్ఎస్ఎస్ విద్యార్థుల పిలుపు.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 6 Nov 2026 6:01 PM IST
Cumbum
X

Cumbum: ఎస్.వి.కె.పి. డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ‘నిషా ముక్త్ భారత్’ ర్యాలీ

కంభం: మార్కాపురం జిల్లా,, కంభం స్థానిక ఎస్.వి.కె.పి. డిగ్రీ కళాశాల, నందు నేడు జాతీయ సేవా పథకం (NSS) విద్యార్థుల ఆధ్వర్యంలో నిషా ముక్త్ భారత్ (మత్తు పదార్థాల రహిత భారతదేశం) అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా ఎన్.ఎస్.ఎస్. విద్యార్థులు కంభం పట్టణంలోని పురవీధుల గుండా ర్యాలీ నిర్వహిస్తూ మద్యం, గంజాయి, పొగాకు మరియు ఇతర మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ప్రజలకు అవగాహన కల్పించారు.

మత్తు పదార్థాల వినియోగం వల్ల ఆరోగ్యానికి తీవ్ర హాని కలగడమే కాకుండా, వ్యక్తిగత జీవితం మరియు కుటుంబ వ్యవస్థపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందని వివరించారు.

ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవితాన్ని అలవర్చుకోవాలని సూచించారు. మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని, సమాజంలో చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కళాశాల అధినేత గోళ్ళ సుబ్బరత్నం, ప్రిన్సిపాల్ కూన రాము, ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రాం ఆఫీసర్లు జె. నరసింహారావు, వి.ఎస్.వి.ఎ. ప్రసాద్, ఎన్.ఎస్.ఎస్. విద్యార్థులు మరియు కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU