Cumbum: కంభం ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు
Cumbum: కంభం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓట్ల లెక్కింపునకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు. 110 మంది సిబ్బందితో నిఘా, 144 సెక్షన్ ఆంక్షలు అమలు.
Cumbum: కంభం ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు
కంభం: మార్కాపురం జిల్లా కంభం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించనున్న ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా బందోబస్తు విధులకు హాజరయ్యే పోలీసు సిబ్బందికి సమగ్రంగా బ్రీఫింగ్ నిర్వహించి, ప్రతి ఒక్కరికి విధుల కేటాయింపు, పాయింట్ల వారీగా బాధ్యతలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు పాటించాల్సిన భద్రతా నిబంధనలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
విధులకు సంబంధించిన పాస్‌పోర్టులను సంబంధిత పాయింట్ అధికారులకు అందజేసి, వారి విధులపై ప్రత్యేకంగా వివరించడం జరిగింది. ఈ బందోబస్తులో మొత్తం 110 మంది పోలీసు సిబ్బంది అందులో ఆరు మంది ఎస్‌ఐలు, ముగ్గురు మంది సీఐలు విధులు నిర్వహించనున్నారు.
ఓట్ల లెక్కింపు కేంద్రం పరిసర ప్రాంతాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా నిషేధాజ్ఞలు అమలు చేయడం జరిగింది. లెక్కింపు కేంద్రం పరిసరాల్లో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడకుండా ఆంక్షలు విధించడంతో పాటు, ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టడం మరియు పరిసర ప్రాంతాల్లోని దుకాణాలను మూసివేయాలని ఆదేశించడం జరిగింది.
ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించేందుకు పోలీసు శాఖ అన్ని ముందస్తు భద్రతా చర్యలు చేపట్టింది. ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు పోలీసులకు సహకరించి శాంతిభద్రతల పరిరక్షణకు తోడ్పడాలని విజ్ఞప్తి చేయడమైనది.




