Santanuthalapadu: సంతనూతలపాడు నియోజకవర్గంలో వివాదాస్పదంగా పరిషత్ పోలింగ్!

Santanuthalapadu: ప్రకాశం జిల్లా సంతనూతలపాడు పరిధిలోని చీమకుర్తిలో వైఎస్‌ఆర్‌సీపీ పోలింగ్ ఏజెంట్లను పోలీసులు స్టేషన్‌కు తరలించడంపై వివాదం రాజుకుంది.

G.V. Naresh Kumar, Prakasam
Published on: 5 Nov 2026 9:53 AM IST
Santanuthalapadu
X

Santanuthalapadu: సంతనూతలపాడు నియోజకవర్గంలో వివాదాస్పదంగా పరిషత్ పోలింగ్!

Santanuthalapadu: ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. అయితే చీమకుర్తి మండలంలో పోలీసుల వ్యవహారశైలి చర్చనీయాంశంగా మారింది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు పోలింగ్ ఏజెంట్లుగా కూర్చునే వ్యక్తులను పోలీసులు జల్లెడ పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సీఐ దాసరి ప్రసాద్ ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను రాత్రి నుంచే పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నట్లు సమాచారం. పోలింగ్ ఏజెంట్లుగా ఉండాల్సిన వారిని పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లడంపై వైఎస్సార్‌సీపీ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్నికల పోలింగ్ ప్రారంభమైన నేపథ్యంలో ఈ పరిణామం స్థానికంగా చర్చకు దారితీసింది.

G.V. Naresh Kumar, Prakasam

G.V. Naresh Kumar, Prakasam