Cumbum: మతసామరస్యానికి ప్రతీకగా కంభం ముస్లింలు
Cumbum: మార్కాపురం జిల్లా కంభంలో వాసవీమాత గ్రామోత్సవం సందర్భంగా మహబూబియా మసీదు కమిటీ సభ్యులు వాసవీ కమిటీని ఘనంగా సన్మానించి మతసామరస్యం చాటారు.
Cumbum: మతసామరస్యానికి ప్రతీకగా కంభం ముస్లింలు
మార్కాపురం జిల్లా: కంభం హిందూ ముస్లింల ఐక్యతకు, మతసామరస్యానికి ప్రతీకగా కంభం పట్టణంలో మహబూబియా కమిటీ మసీదు సభ్యులు ఆదర్శంగా నిలిచారు. వాసవీమాత గ్రామోత్సవం సందర్భంగా కంభం ముస్లిం సోదరులు, మహబూబియా కమిటీ మసీదు సభ్యులు కలిసి శ్రీ వాసవీమాత కమిటీ సభ్యులను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా హిందూ ముస్లింలు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి జీవించాలని, పరస్పర గౌరవం, ప్రేమాభిమానాలతో మెలగాలని పిలుపునిచ్చారు. పండుగలు, ఉత్సవాలు మతాలకు అతీతంగా ప్రజల మధ్య ఐక్యతను పెంపొందిస్తాయని, కులమత భేదాలకు తావులేకుండా మతసామరస్యాన్ని కాపాడుకోవాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సయ్యద్ జాకిర్ హుస్సేన్, మాజీ వైస్ సర్పంచ్ సయ్యద్ ఖాసిం, మసీదు కమిటీ సభ్యులు వహబ్, అమానుల్లా ఖాన్, మహమ్మద్ రఫీతో పాటు పలువురు ముస్లిం సోదరులు పాల్గొన్నారు.




