Markapuram: దుపాడు, మేడపి స్వర్ణ గ్రామ కార్యాలయాల్లో కలెక్టర్ తనిఖీ!

Markapuram: మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం దుపాడు, మేడపి స్వర్ణ గ్రామ కార్యాలయాల్లో కలెక్టర్ ఎం. విజయ సునీత ఆకస్మిక తనిఖీలు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 18 Sept 2026 5:42 PM IST
Markapuram
X

Markapuram: దుపాడు, మేడపి స్వర్ణ గ్రామ కార్యాలయాల్లో కలెక్టర్ తనిఖీ!

Markapuram: మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలంలో జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దుపాడు, మేడపి గ్రామాల్లోని స్వర్ణ గ్రామ కార్యాలయాలను తనిఖీ చేసిన కలెక్టర్ సిబ్బంది హాజరు పట్టికలను పరిశీలించారు.

ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ సేవలపై ప్రజల్లో సానుకూల అభిప్రాయం పెరిగేలా అధికారులు, సిబ్బంది పనిచేయాలని సూచించారు.

పెన్షన్ల డిజిటైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. అర్హులైన లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెన్షన్లు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. భూ రీ-సర్వేను వేగంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

రైతులకు ఎరువులు, విత్తనాలు కొరత లేకుండా సకాలంలో అందుబాటులో ఉంచాలని సూచించారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని... డ్రైనేజీల శుభ్రత, చెత్త సేకరణ, దోమల నివారణ చర్యలు నిరంతరం చేపట్టాలని ఆదేశించారు.

ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఎం. విజయ సునీత స్పష్టం చేశారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM