Vemulakota: మార్కాపురం జిల్లా వేములకోటలో నూతన జెడ్పీ కార్యాలయం ప్రారంభం!
Vemulakota: మార్కాపురం జిల్లా వేములకోటలో నూతన జెడ్పీ కార్యాలయాన్ని ప్రారంభించిన కలెక్టర్ ఎం. విజయసునీత.. జెడ్పీ ప్రత్యేకాధికారిగా బాధ్యతల స్వీకరణ, పాల్గొన్న ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి.
Vemulakota: మార్కాపురం జిల్లా వేములకోటలో నూతన జెడ్పీ కార్యాలయం ప్రారంభం!
Vemulakota: మార్కాపురం జిల్లా వేములకోటలో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. మధ్యాహ్నం 12:15 గంటలకు జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ ఎం. విజయసునీత రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి, జిల్లా ప్రజా పరిషత్ ప్రత్యేకాధికారిగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
కార్యక్రమానికి మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి హాజరై కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. నూతన జెడ్పీ కార్యాలయం ద్వారా ప్రజలకు పాలనా సేవలను మరింత చేరువ చేస్తామని కలెక్టర్ విజయసునీత తెలిపారు. గ్రామీణాభివృద్ధి, మౌలిక వసతులు, సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ మార్కాపురం జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.




