Podili: పొదిలికి సీఎం చంద్రబాబు మరో రూ.20 కోట్ల నిధులు మంజూరు
Podili: పొదిలి నగర పంచాయతీ సమగ్రాభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు మరో రూ.20 కోట్ల నిధులు మంజూరు చేశారని నగర కమిషనర్ రామ్మోహన్ తెలిపారు.
Podili: పొదిలికి సీఎం చంద్రబాబు మరో రూ.20 కోట్ల నిధులు మంజూరు
మార్కాపురం జిల్లా: పొదిలి నగర పంచాయితీ కి మహర్దశ పట్టిందని ఇప్పటికే కొట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులు జరుగుతుండగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరొ 20 కొట్ల రూపాయలు నిధులు మంజూరు చేసినట్లు పొదిలి నగర కమిషనర్ రామ్మోహన్ తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన వర్చువల్ సమావేశం లో ఆయన వెల్లడించినట్లు ఆయన తెలిపారు. ఇక నుంచి పట్టణాభివృద్ధి శరవేగంగా జరగబొతుందని, రొడ్లు, డ్రైనేజీలు,వీధిలైట్లు కు 20 కొట్ల రూపాయలు ఖర్చు పెడతామని తెలిపారు.
నిధుల మంజూరు తో పొదిలి పట్టణం ముఖచిత్రం మారబొతుందని, పొదిలి నగర పంచాయతీ అభివృద్దికి మొత్తం 171 కొట్ల రూపాయలు మంజూరు అయినట్లు ఆయన తెలిపారు ,పట్టణ ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారని, అభివృద్ధి సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సమావేశంలో మున్సిపల్ సిబ్బంది,సచివాల ఉద్యొగులు, టిడిపి పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు.




