Kondapi: ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ఇదే!
Kondapi: ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం జరుగుమల్లి మండలం నర్సింగోలులో రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన షెడ్యూల్ వివరాలు.
Kondapi: ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ఇదే!
Kondapi: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం (అక్టోబర్ 9) ప్రకాశం జిల్లాలోని కొండపి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. జరుగుమల్లి మండలం నర్సింగోలులో సీఎం పర్యటనకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. హెలిప్యాడ్, ప్రజా వేదిక, క్యాడర్ సమావేశ ప్రాంగణం తదితర ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పరిశీలించారు.
సీఎం పర్యటన షెడ్యూల్ ఉదయం 10:00 గంటలకు: ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరుతారు.ఉదయం 10:40 గంటలకు: నర్సింగోలు హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.ఉదయం 11:00 గంటలకు: నర్సింగోలులో రైతులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి కార్యక్రమం.
ఉదయం 11:45 గంటలకు: గ్రామ సభకు హాజరవుతారు.గ్రామ సభలో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను సీఎం సందర్శిస్తారు.మధ్యాహ్నం 3:15 గంటలకు: పార్టీ క్యాడర్ సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 4:45 గంటలకు: క్యాడర్ సమావేశం ముగించుకుని బయలుదేరుతారు.
సాయంత్రం 4:55 గంటలకు: నర్సింగోలు హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరుతారు. సాయంత్రం 5:35 గంటలకు: ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో భద్రత, ట్రాఫిక్, పార్కింగ్, హెలిప్యాడ్, సభా వేదిక తదితర ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.




