Markapuram: మార్కాపురంలో చైర్మన్ అభ్యర్థి వాట్సాప్ స్టేటస్ సంచలనం!
Markapuram: మార్కాపురం మున్సిపల్ ఎన్నికల వేళ చైర్మన్ అభ్యర్థి పెట్టిన వాట్సాప్ స్టేటస్ కలకలం. ఓటు హక్కును కొనుగోలు చేయడం ఇష్టం లేదంటూ సందేశం. పోటీకి దూరమయ్యారా?
Markapuram: మార్కాపురంలో చైర్మన్ అభ్యర్థి వాట్సాప్ స్టేటస్ సంచలనం!
Markapuram: మార్కాపురం మున్సిపల్ ఎన్నికల వేళ చైర్మన్ అభ్యర్థికి సంబంధించిన ఓ వాట్సాప్ స్టేటస్ స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన అత్యంత శక్తివంతమైన ఆయుధం ఓటు హక్కు అని, అలాంటి పవిత్రమైన ఓటు హక్కును కొనుగోలు చేయడం తనకు ఇష్టం లేదని ఆమె తన వాట్సాప్ స్టేటస్‌లో సందేశాన్ని ఉంచారు.
ఈ సందేశం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి? ఎన్నికల పోటీ నుంచి ఆమె వెనక్కి తగ్గుతున్నారా? లేక ఓటు హక్కు విలువను తెలియజేసే ప్రయత్నమా? అన్న చర్చ పట్టణ రాజకీయ వర్గాల్లో మొదలైంది. అయితే ఆమె నిజంగా పోటీ నుంచి తప్పుకున్నారా? అనే విషయంపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. ఆమె వాట్సాప్ సందేశం ఇప్పుడు మార్కాపురం రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.




