Komarolu: రాజుపాలెంలో వృథాగా పోతున్న బోరుబావి నీరు పట్టించుకోని అధికారులు!
Komarolu: గిద్దలూరు నియోజకవర్గం కొమరోలు మండలం రాజుపాలెం పాఠశాల సమీపంలో బోరుబావి నీరు వృథాగా పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Komarolu: రాజుపాలెంలో వృథాగా పోతున్న బోరుబావి నీరు పట్టించుకోని అధికారులు!
Komarolu: గిద్దలూరు నియోజకవర్గంలోని కొమరోలు మండలం రాజుపాలెం గ్రామంలో ఉన్నత పాఠశాల సమీపములో వృథాగా పోతున్న బోరుబావి నీరు . నియోజకవర్గంలో ఎల్ నినో కారణంగా వర్ష లేమితో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న వేళ మరోవైపు విలువైన నీరు వృథాగా పోతున్న పట్టించుకునే నాధుడు లేడు
లీకేజీ ఏర్పడి నీరు వృథాగా పోతోంది. ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న సమయంలో ఇలాంటి లీకేజీలపై అధికారులు వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి లీకేజీని మరమ్మత్తులు చేసి నీటి వృథాను నిలువరించాలని ప్రజలు కోరుతున్నారు.




