Bestavaripeta: బేస్తవారిపేటలో ₹4.55 కోట్లతో రోడ్లు: ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
Bestavaripeta: బేస్తవారిపేట మండలంలో 'పల్లె పండుగ-3.0' ద్వారా ₹4.55 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 11 తారు, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
Bestavaripeta: బేస్తవారిపేటలో ₹4.55 కోట్లతో రోడ్లు: ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
మార్కాపురం జిల్లా: బేస్తవారిపేట మండలంలో పల్లె పండుగ–3.0 ద్వారా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ రూ.4.55 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు తారు రోడ్లు, అంతర్గత సీసీ రోడ్లు,
నేకునాంబాద్ – 2 పనులకు 60 లక్షలు
గలిజేరుగుళ్ల – 3 పనులకు 1.45 కోట్లు
జె.సి. అగ్రహారం – 3 పనులు 1.50 కోట్లు
బేస్తవారిపేట – 3 పనులు 1.00 కోటి రూపాయలతో,
11 పనులకు గాను 4.55 కోట్ల రూపాయలతో తారు రోడ్లు, అంతర్గత C.C రోడ్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. బార్లకుంట–బాలేశ్వరపురం, గల్జేరుగుల్ల–చెన్నుపల్లె, పిట్టకాయగుల్ల–వంగపాడు, జె.సి. అగ్రహారం–కె.మల్లపురం, ఒంగోలు హైవే–సలకలవీడు, మోక్షగుండం–ఖాజీపురం తదితర మార్గాల్లో రహదారి పనులతో పాటు పిట్టకాయగుల్ల, మోక్షగుండం గ్రామాల్లో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలను మెరుగుపరచి ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన రాకపోకలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. పల్లె పండుగ–3.0 ద్వారా గ్రామాల రూపురేఖలు మారుస్తూ అభివృద్ధిని ప్రతి పల్లెకు చేరుస్తున్నామని, ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని మౌలిక వసతుల పనులు చేపడతామని ఎమ్మెల్యే తెలిపారు.
కార్యక్రమంలో మండలం ప్రముఖులు కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.




