Prakasam: మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి: ఎమ్మెల్యే బూచేపల్లి
Prakasam: దర్శి మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రెండు మూడు రోజుల్లో రానుందని, 28 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల జాబితా సిద్ధం చేయాలని ఎమ్మెల్యే బూచేపల్లి అన్నారు.
Prakasam: మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి: ఎమ్మెల్యే బూచేపల్లి
Prakasam: మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి అని దర్శి MLA ప్రకాశం జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఆదివారం దర్శి పార్టీ ఆఫీస్ లో దర్శి మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగినది.
ఈ సందర్బంగా MLA బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్ 2 లేదా 3 రోజుల్లో వస్తుంది అని నోటిఫికేషన్ వచ్చే టైం కు 28 వార్డ్ లలో పోటీ చేసే అభ్యర్థులు లిస్ట్ రెడీ గా ఉంచుకోవాలి అని అన్నారు.
దర్శి మున్సిపాలిటీ ఎన్నిక మనకు ముఖ్యమని అందరు కలిసి కట్టుగా పని చేసి దర్శి మున్సిపాలిటీ లో విజయం సాధించాలని కోరారు. రాష్ట్ర CEC మెంబెర్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ దర్శి మున్సిపాలిటీ లో మన పార్టీ అభ్యర్థులను గెలిపించి YS జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ గా ఇవ్వాలి అని అన్నారు.
ఈ కార్యక్రమం లో మండల పార్టీ అధ్యక్షులు వెన్నపూస వెంకట రెడ్డి, మాజీ ఎంపీపీ లు,మాజీ జడ్పీటీసీ లు, దర్శి పట్టణ కౌన్సిలర్స్ మరియు అన్ని వార్డ్ ల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు




