Singarayakonda: మౌలాబీ బలవన్మరణ కేసులో నిందితులను అరెస్టు చేయాలి: నీలం!

Singarayakonda: మౌలాబీ బలవన్మరణ కేసులో నిందితులను అరెస్టు చేయకుండా సింగరాయకొండ సీఐ గొడుగు పడుతున్నారని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేంద్రరావు ఆరోపించారు.

Ram Mohan, Singarayakonda
Published on: 14 Nov 2026 6:45 PM IST
Singarayakonda
X

Singarayakonda: మౌలాబీ బలవన్మరణ కేసులో నిందితులను అరెస్టు చేయాలి: నీలం!

ప్రకాశం జిల్లా: కూటమి ప్రభుత్వ దాష్టికానికి బలైపోయిన మౌలాబి బలవన్మరణ కేసులో అగ్రకుల రమణారెడ్డి ముఠాను అరెస్టు చేయకుండా సింగరాయకొండ సిఐ శ్రీహరి గొడుగు పడుతున్నారని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేందర్రావు ఆరోపించారు. శనివారం సింగరాయకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం ముందు తౌశిక్ మరియు మౌలాబి ఎఫ్ఐఆర్ కాపీలను మీడియాకు చూపిస్తూ నీలం నాగేంద్రరావు మాట్లాడారు.

కనిగిరి కి చెందిన తౌశిక్ సింగరాయకొండ లో చైతన్య నవోదయ స్కూల్లో చదువుకుంటూ స్కూల్ యాజమాన్యంచే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు అన్నారు. ఈ ఘటన క్రైమ్ నెంబర్ 17/26 అనుమానస్పద మరణంగా ఈ సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీన సింగరాయకొండ పోలీస్ స్టేషన్లో నమోదయిందన్నారు. అప్పటి సింగరాయకొండ ఎస్ఐ మహేంద్ర, సిఐ హజరత్ అయ్యలు ఒంగోలు పోస్టుమార్టం రూము వద్ద తౌశిక్ తల్లిదండ్రులను బెదిరించారన్నారు.

తరువాత తౌశిక్ తల్లిదండ్రులు తమకు న్యాయం చేయాలని ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేయగా తాము మద్దతు తెలిపి జిల్లా కలెక్టర్ రాజాబాబుతో మాట్లాడి తౌశిక్ మృతిపై డీఈఓ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మరియు సింగరాయకొండ ఎంఆర్ఓ లతో త్రీమెన్ కమిటీని నియమింప చేసామన్నారు. త్రీమెన్ కమిటీ సింగరాయకొండ వచ్చి విచారణ జరిపి చైతన్య నవోదయ స్కూలు కనిగిరిలో పర్మిషన్ తీసుకొని సింగరాయకొండలో నడుపుతున్నందున సింగరాయకొండలో ప్రభుత్వ అనుమతి లేనందున రద్దు చేశారు.

కానీ ప్రభుత్వ ఆదేశాలను లెక్కచేయకుండా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి చైతన్య నవోదయ స్కూల్ యాజమాన్యం వాక రమణారెడ్డి ముఠాకు అండగా నిలిచి స్కూల్ మూత వేయకుండా జిల్లా కలెక్టర్ పై ఒత్తిడి తెచ్చారన్నారు. తౌశిక్ మరణం పై ఆందోళన కొనసాగుతుంటే పోలీస్ అధికారులు వాకా రమణారెడ్డి ముఠాను అరెస్టు చేయకుండా కాలయాపన చేసి ఆత్మహత్యగా కేసు మూసివేయాలనుకున్నారు.

సుమారు 7 నెలలపాటు తౌశిక్ మృతిపై తల్లితండ్రులు నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభల్లో కూడా నిరసన తెలిపారన్నారు. కానీ న్యాయం జరగకపోగా మౌలాబీ కుటుంబానికి పోలీసు వేధింపులు ఎక్కువయ్యాయి అన్నారు ఈ దశలో తౌశిక్ కేసులో మౌలాబీ దంపతులు హైకోర్టులో కూడా పోలీస్ అధికారుల వైఖరిపై కేసు వేశారన్నారు.

ఇందులో చైతన్య నవోదయ స్కూల్ యాజమాన్యం వాక రమణారెడ్డి ముఠా అరెస్ట్ కాకుండా కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి హైకోర్టులో స్టే ఇచ్చారన్నారు. ఈ ఏడు నెలల నుండి డీఈఓ రద్దు చేసిన లెక్కచేయకుండా చైతన్య నవోదయ స్కూలు పర్మిషన్ లేకుండానే ఒంగోలు ఎంపీ మాగుంట, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి భరోసాతో రెచ్చిపోయిన రమణారెడ్డి ముఠా స్కూల్ నడిపిస్తుందన్నారు.

తన బిడ్డను చంపి హైకోర్టుకెళ్లిన జిల్లా కలెక్టర్ ఎస్పీలు తమకు న్యాయం చేయలేదని పర్మిషన్ రద్దు చేసిన స్కూలు నడుస్తుందని మౌలాబీ బాధపడింది అన్నారు. ఈ క్రమంలో సింగరాయకొండ పోలీస్ స్టేషన్ ముందు నిరాహార దీక్ష చేస్తూ సెప్టెంబర్ 12వ తేదీన గడ్డి మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసిందన్నారు.

మూడు రోజుల తర్వాత మౌలాబి హైదరాబాదులో మరణించగా సింగరాయకొండ పోలీసు వారు మొక్కుబడిగా క్రైమ్ నెంబర్ 147/26 అనుమానాస్పద మరణం 194 BNSS సెక్షన్ కేసు కట్టారు. మౌలాబి రాతపూర్వకంగా మరియు తన మరణానికి కారణం తన కొడుకు మరణానికి కారణం వాక రమణారెడ్డి ముఠా సభ్యుల పేర్లు స్పష్టంగా చెప్పిన ఆమె మరణించిన తర్వాత కనిగిరిలో రోడ్డుపై మౌలాబి శవాన్ని ఉంచి ఆందోళన చేస్తే కానీ 108 BNS గా కేసు మార్చలేదన్నారు.

సెప్టెంబర్ 15వ తేదీన మౌలాబి బలవన్మరణ కేసులో ముద్దాయి పేర్లు వీడియో సాక్షాదారాలున్న రమణారెడ్డి ముఠాకు సింగరాయకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీహరి గొడుగు పట్టారన్నారు. సుమారు రెండు నెలల తర్వాత కలెక్టరేట్ ముట్టడి తదితర ఆందోళనతో ఎట్టకేలకు వాక చైతన్య మరియు బాజీ అను ఇద్దరిని మాత్రమే అరెస్టు చేసి రమణారెడ్డి ముఠా పరారీలో ఉందని పోలీసు వేట కొనసాగుతుందని సింగరాయకొండ సిఐ మీడియాకు తెలిపారు.

మౌలాబి మరణ వాగ్మూలంలో పేర్కొన్నట్లు వాకా రమణారెడ్డి ముఠాతో పాటు డీఈఓ రేణుక సింగరాయకొండ ఎంఈఓ లను కూడా వెంటనే అరెస్టు చేయాలన్నారు. అదే స్కూల్ యాజమాన్యం ముస్లింలు లేదా దళితులు అయితే వారిని అరెస్టు చేయకుండా పోలీస్ అధికారులు చూస్తూ ఉంటారా అని నీలం ప్రశ్నించారు.

తౌశిక్ మరణానికి చైతన్య నవోదయ స్కూల్ యాజమాన్యం వాకా రమణారెడ్డి ముఠా కారణమైతే మౌలాబి మరణానికి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి రాజకీయ పలుకుబడి డిఈఓ రేణుక సింగరాయకొండ ఎంఈఓ అవినీతి అక్రమాలే కారణమని నీలం నాగేందర్రావు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా కార్యదర్శి కాకుమను రవి, పట్రా బంగారం, దామవరపు నాగసాయి తదితరులు ఉన్నారు.

Ram Mohan, Singarayakonda

Ram Mohan, Singarayakonda