Marripudi: సంక్షేమం, అభివృద్ధిలో ఏపీయే నంబర్ వన్: మంత్రి డోలా
Marripudi: దేశంలో అభివృద్ధి, సంక్షేమానికి అత్యధిక నిధులు వెచ్చిస్తున్న రాష్ట్రం ఏపీయేనని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. మర్రిపూడిలో పింఛన్లు పంపిణీ చేశారు.
Marripudi: సంక్షేమం, అభివృద్ధిలో ఏపీయే నంబర్ వన్: మంత్రి డోలా
ప్రకాశంజిల్లా: ప్రకాశంజిల్లా మర్రిపూడి మండలంలోని పలుగ్రామాలలో ఆయన పర్యటించి ఎన్టీఆర్ భరొసా పెన్షన్ మరియు అభివృద్ధి పనులకు శంకుస్దాపనలు చేశారు, అనంతరం ప్రజలతో మాట్లాడారు.
గ్రామీణా ప్రాంతాల్లో రొడ్లు, వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని గత ప్రభుత్వంలో గ్రామీణా ప్రాంతాల్లో సరైన రహదారి లేక గర్భిణి స్త్రీలు పురిటినొప్పులతో తీవ్రంగా ఇబ్బంది పడ్డారన్నారు,
త్వరలో నియోజకవర్గానికి డయాలసిస్ సెంటర్ రాబొతున్నట్లు తెలిపారు,నూతన పెన్షన్ల వెరిఫికేషన్ కొనసాగుతుందని అర్హులైన అందరికీ పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందని, సంక్షేమా పధకాలు పేదలకు అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని రైతులకు ప్రయోజనం చేకుర్చే విధంగా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో పండ్ల తోటల పెంపకం ప్రారంభించబొతున్నట్లు తెలిపారు,
త్వరలో నీటి ప్రాజెక్టులు అన్ని పూర్తి చేసి రైతులకు సాగునీరు తాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు, అనంతరం పలువూరికి ఎన్టీఆర్ భరొసా పెన్షన్ అందజేశారు.
ఈ కార్యక్రమంలో కొండేపి నియోజకవర్గ అధికారులు, టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




