Darsi: దర్శిలో రూ.12 కోట్ల అభివృద్ధి పనులు: సీఎం ప్రారంభం

Darsi: రాష్ట్రవ్యాప్తంగా పట్టణాల్లో రూ.11,359 కోట్ల పనులను సీఎం చంద్రబాబు కుప్పం నుంచి ప్రారంభించారు. దర్శిలో రూ.12 కోట్ల పనులకు శ్రీకారం చుట్టారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 22 Sept 2026 3:33 PM IST
Darsi
X

Darsi: దర్శిలో రూ.12 కోట్ల అభివృద్ధి పనులు: సీఎం ప్రారంభం

Darsi: పట్టణాల రూపురేఖలు మార్చేలా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పోరేషన్లల్లో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

రాష్ట్రవ్యాప్తంగా వివిధ మున్సిపాల్టీలు, కార్పోరేషన్లల్లో చేపట్టే అభివృద్ధి పనులను కుప్పం నుంచి వర్చువల్ గా ప్రారంభించిన సీఎం చంద్రబాబు. దర్శి మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో రూ.12 కోట్ల విలువైన పనులను ప్రారంభించిన సీఎం.

ఈ కార్యక్రమానికి దర్శి పట్టణం, పొదిలి రోడ్ లోని పి.జి.ఎన్. కాంప్లెక్స్ నందు దర్శి మున్సిపల్ శాఖ వారు ఏర్పాటు చేసిన HAM ప్రాజెక్ట్ ప్రారంబోత్సవ కార్యక్రమంలో వర్చువల్ గా దర్శి నుంచి హాజరైన దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు.

మౌలిక వసతుల కల్పనలో భాగంగా పట్టణ స్థానిక సంస్థలల్లో రూ.11,359 కోట్ల విలువైన పనులకు శ్రీకారం, 123 మున్సిపాలిటీల్లో రూ.7469 కోట్ల పనులు, దర్శి మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో రూ.12 కోట్ల విలువైన పనులను ప్రారంభించిన సీఎం. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభోత్సవంలో పాల్గొన్న 123 మున్సిపాలిటీల ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కమిషనర్లు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్