Markapuram: యర్రబాలెంలో బయటపడ్డ పురాతన లోహ గుండ్లు!

Markapuram: మార్కాపురం జిల్లా కంభం మండలం యర్రబాలెం గ్రామంలో పురాతన ఇనుప/లోహ గుండ్లు లభ్యమయ్యాయి. పాత బురుజు నుంచి పడిన ఈ వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకుని పురావస్తు శాఖకు పంపించారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 19 Oct 2026 11:14 AM IST
Markapuram
X

Markapuram: యర్రబాలెంలో బయటపడ్డ పురాతన లోహ గుండ్లు!

Markapuram: మార్కాపురం జిల్లా కంభం మండలంలోని యర్రబాలెం గ్రామంలో పురాతన ఇనుప గుండ్లు లభించాయి. ఇటీవల కురిసిన వర్షానికి గ్రామంలోని పురాతన బురుజు పైనుంచి మూడు రోజుల కిందట మట్టి పాత్ర కింద పడింది. గుండ్రని ఆకారంలో ఉన్న 56 గుండ్లు కిందపడ్డాయి.

వాటిని వజ్రాలుగా భావించి స్థానికులు రామాలయంలో భద్రపరిచారు. ఈ విషయం ఆదివారం పోలీసులకు తెలియడంతో రెవెన్యూ, పురావస్తు శాఖ వారితో కలిసి వాటిని పరిశీలించారు. పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అల్యూమినియం మెటల్ కరిగించి గుండ్రంగా తయారు చేసి ఉండవచ్చని SI.శివకృష్ణారెడ్డి తెలిపారు. పరిశీలన నిమిత్తం నెల్లూరు పురావస్తు శాఖ అధికారులకు పంపించనున్నట్లు తెలిపారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU