Chimakurthy: పాలిషింగ్ గ్రానైట్‌కూ రాయల్టీ వసూళ్లు AMR ఇండియా సంస్థపై ఆరోపణలు!
Chimakurthy: ప్రకాశం జిల్లా చీమకుర్తిలో గ్రానైట్ ముడి రాళ్లతో పాటు పాలిషింగ్ స్లాబ్‌లపై కూడా రాయల్టీ పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారంటూ AMR ఇండియా సంస్థపై వస్తున్న ఆరోపణలు.
Chimakurthy: పాలిషింగ్ గ్రానైట్‌కూ రాయల్టీ వసూళ్లు AMR ఇండియా సంస్థపై ఆరోపణలు!
Chimakurthy: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా గ్రానైట్ పాలిషింగ్ స్లాబ్‌లకు సైతం రాయల్టీ పేరుతో నగదు వసూలు చేస్తున్నారంటూ AMR ఇండియా లిమిటెడ్ యాజమాన్యంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రానైట్ ముడి రాళ్లకు మాత్రమే రాయల్టీ వసూలు చేయాల్సి ఉన్నప్పటికీ.. పాలిషింగ్ చేసిన గ్రానైట్ స్లాబ్‌లను తరలించే సమయంలోనూ డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం కూనంనేనివారిపాలెంలో నిర్మాణంలో ఉన్న చర్చికి దాతలు ఉచితంగా అందించిన 15 పాలిషింగ్ గ్రానైట్ పీసులు సుమారు 60 అడుగుల గ్రానైట్‌ను ఆటోలో తరలిస్తుండగా AMR ఇండియా లిమిటెడ్ సిబ్బంది అడ్డుకున్నారని ఆటో డ్రైవర్ పి. శ్రీనివాసరావు ఆరోపించారు. గ్రానైట్‌ను చర్చికి తీసుకెళ్తున్నామని వివరించినప్పటికీ రూ.400 చెల్లించాలని డిమాండ్ చేశారని తెలిపారు.
అంతేకాకుండా ఆటోను చీమకుర్తి పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకెళ్లారని డ్రైవర్ పేర్కొన్నారు. పాలిషింగ్ స్లాబ్‌లకు సైతం స్కానర్ ద్వారా నగదు వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఈ నేపథ్యంలో AMR ఇండియా లిమిటెడ్ వద్ద జరుగుతున్న రాయల్టీ వసూళ్లపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. పాలిషింగ్ గ్రానైట్‌కు రాయల్టీ వసూలు చేసే నిబంధనలు ఉన్నాయా? స్కానర్ ద్వారా జరుగుతున్న వసూళ్లకు అధికారిక అనుమతులు ఉన్నాయా? అనే అంశాలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.




