Racharla: పాలకవీడులో హోరెత్తిన ఎంపీటీసీ ఎన్నికల ప్రచారం ఇంటింటికీ వెళ్లిన అంబవరం
Racharla: పాలకవీడు ఎంపీటీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ నాయకుడు అంబవరం శ్రీనివాసరెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
Racharla: పాలకవీడులో హోరెత్తిన ఎంపీటీసీ ఎన్నికల ప్రచారం ఇంటింటికీ వెళ్లిన అంబవరం
Racharla: ఎంపీటీసీ ఎన్నికల్లో తనను ఆదరిస్తే పంచాయతీ అభివృద్ధికి విశేష కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంటు ట్రెజరర్ అంబవరం శ్రీనివాసరెడ్డి అన్నారు ఆదివారం సాయంత్రం ఆయన పాలక వీడు పంచాయతీలోని అనుమలవీడు బీసీ కాలనీ ఎస్సీ కాలనీ పాలకవీడు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
నవంబర్ మూడవ తేదీన జరగబోయే ఎంపీటీసీ ఎన్నికల్లో పాలకవీడు పంచాయతీ ఎంపీటీసీ అభ్యర్థిగా తాను బరిలో దిగబోతున్నానని కాబట్టి తనను ఆదరించి ఆశీర్వదించి ఎన్నికల్లో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సహకారంతో పంచాయితీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని, ఆయన సహకారంతో ఇప్పటికే పంచాయతీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని భవిష్యత్తులో కూడా చేపడతామని అన్నారు.
అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని కాబట్టి పంచాయతీని అభివృద్ధి చేసుకునేందుకు మనకు ఎలాంటి ఇబ్బంది లేదని కాబట్టి ప్రజలు ఆలోచించి ఓటు వేసే విషయంలో మంచి నిర్ణయం తీసుకోవాలన్నారు పంచాయతీ అభివృద్ధి ప్రజా సంక్షేమానికి తాను ప్రత్యేక కృషి చేస్తానని ఆయన అన్నారు.
అభివృద్ధి సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు కాబట్టి ఎంపీటీసీ ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు.ఎన్నికల ఇంటింటి ప్రచారంలో ప్రజలనుండి ఆయనకు విశేష స్పందన లభించింది మహిళలు యువకులు పార్టీ శ్రేణులు అన్ని వర్గాల ప్రజలు శ్రీనివాస రెడ్డికి ఆత్మీయ స్వాగతం పలకడమే కాకుండా సంపూర్ణ మద్దతు ప్రకటించి తమ ఓటు మీకు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని ఆయనకు హామీ ఇచ్చారు.




