Markapuram: మార్కాపురంలో రాయితీ గ్యాస్ సిలిండర్ల వాణిజ్య వినియోగంపై ఆరోపణలు!

Markapuram: ప్రకాశం జిల్లా మార్కాపురంలో సామాన్య ప్రజలకు అందాల్సిన రాయితీ గ్యాస్ సిలిండర్లు హోటళ్లు, వాణిజ్య కేంద్రాలకు మళ్లుతున్నాయనే ఆరోపణలపై విచారణకు డిమాండ్.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 8 Oct 2026 8:04 AM IST
Markapuram
X

Markapuram: మార్కాపురంలో రాయితీ గ్యాస్ సిలిండర్ల వాణిజ్య వినియోగంపై ఆరోపణలు!

Markapuram: సామాన్య ప్రజలకు అందాల్సిన గృహావసర గ్యాస్ సిలిండర్లు వాణిజ్య అవసరాలకు మళ్లుతున్నాయనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, టీ కొట్లు, బజ్జీ బండ్లు, ఇతర ఆహార తయారీ కేంద్రాల్లో డొమెస్టిక్ సిలిండర్ల వినియోగంపై అధికారులు దృష్టి సారించాలనే డిమాండ్ వినిపిస్తోంది.

కమర్షియల్ సిలిండర్ల ధర ఎక్కువగా ఉండటంతో కొందరు వ్యాపారులు గృహ సిలిండర్లను ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో, అవసరం లేని సిలిండర్లను కొందరు వినియోగదారులు వ్యాపారులకు విక్రయిస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి.

గ్యాస్ ఏజెన్సీల డెలివరీ వ్యవస్థలో ఎక్కడైనా అక్రమాలకు తావు ఉందా? వినియోగదారుల పేర్లపై బుకింగ్ చేసి సిలిండర్లు ఇతరులకు మళ్లుతున్నాయా? అనే అంశాలపై అధికారులు దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది.

ఇళ్లలో ఉండాల్సిన గ్యాస్ సిలిండర్లు వ్యాపార అడ్డాల్లోకి ఎలా చేరుతున్నాయి? రాయితీ సొమ్ముకు బాధ్యత ఎవరిది? అధికారుల తనిఖీలు ఎక్కడ?

అక్రమ వినియోగం నిజమని తేలితే సంబంధిత వినియోగదారులు, వ్యాపార సంస్థలు, సరఫరా వ్యవస్థలో బాధ్యులపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అదే సమయంలో వాణిజ్య సంస్థలు భద్రతా ప్రమాణాలు పాటిస్తూ కమర్షియల్ సిలిండర్లనే వినియోగించేలా అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM