Addanki: మున్సిపల్ ఎన్నికల వేళ పోలీసుల భారీ కవాతు!

Addanki: అద్దంకి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ నేతృత్వంలో పోలీసుల కవాతు. అవాంఛనీయ సంఘటనలు జరిగితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక.

Kolla Singaiah, Addanki
Published on: 26 Oct 2026 11:34 PM IST
Addanki
X

Addanki: మున్సిపల్ ఎన్నికల వేళ పోలీసుల భారీ కవాతు!

అద్దంకి: ప్రకాశం జిల్లా అద్దంకి పురపాలక మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పట్టణ పుర వీధుల్లో పోలీసుల కవాతు. అద్దంకి పట్టణంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కవాతు నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు.

దర్శి డిఎస్పి బాలమురళీకృష్ణ ఆధ్వర్యంలో పోలీసుల కవాతు నిర్వహించారు ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామన్నారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

ప్రజల్లో భరోసా కల్పించడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రజలకు సూచించారు.

పట్టణంలో పలు వార్డుల్లో పోలీసులు చేపట్టిన కవాతు లో అద్దంకి సీఐ సుబ్బరాజు, రూరల్ సీఐ మల్లికార్జున సంతమాగులూరు సీఐ శేషగిరిరావు తో పాటు అద్దంకి , పంగులూరు , బల్లికురవ సంతమాగులూరు కొరిసపాడు ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Kolla Singaiah, Addanki

Kolla Singaiah, Addanki