Addanki: సింగరకొండ ఆలయంలో రికార్డులు పరిశీలించిన దేవదాయ శాఖ కమిషనర్

Addanki: అద్దంకి సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ రికార్డులను పరిశీలించి, పారిశుధ్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

Kolla Singaiah, Addanki
Published on: 3 Oct 2026 8:58 PM IST
Addanki
X

Addanki: సింగరకొండ ఆలయంలో రికార్డులు పరిశీలించిన దేవదాయ శాఖ కమిషనర్

అద్దంకి: ప్రకాశం జిల్లా అద్దంకి మండలం సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్‌ రామచంద్ర మోహన్‌ రికార్డులను పరిశీలించారు. దేవాలయాల్లో రికార్డుల తనిఖీలో భాగంగా సింగరకొండకు వచ్చిన ఆయన.. ఆలయానికి సంబంధించిన రికార్డులు, బిల్లులు, నిర్వహణ వివరాలను పరిశీలించారు.

ఆలయ ప్రాంగణంలో పారిశుధ్య లోపాలను గుర్తించిన కమిషనర్‌.. పరిశుభ్రతను మెరుగుపరచాలని సూచించారు. రికార్డులు, సంబంధిత బిల్లుల నిర్వహణ సక్రమంగా లేదని పేర్కొన్నారు. ఎన్‌ఎంఆర్‌ కింద ఉద్యోగులను నియమించకూడదని, అవసరమైతే ఔట్‌సోర్సింగ్‌ విధానంలో సిబ్బందిని నియమించుకుని సేవలు వినియోగించుకోవచ్చని తెలిపారు. ఆలయంలో జరుగుతున్న కార్యక్రమాలు, ధర్మకర్తల మండలి నెలవారీ సమావేశాలు, రికార్డుల నిర్వహణపై పాలకవర్గ సభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

ప్రస్తుతం ఆలయానికి సంబంధించిన రికార్డు పుస్తకాలపై ఆడిటింగ్‌తో పాటు విచారణ కొనసాగుతోందని కమిషనర్‌ తెలిపారు. తన పరిశీలనలో గుర్తించిన లోపాలు, ఇతర అంశాలను పూర్తిగా పరిశీలించిన అనంతరం మీడియాకు వెల్లడిస్తానన్నారు. రికార్డుల పరిశీలన సమయంలో ఆలయ సిబ్బంది అందుబాటులో లేకపోవడంపై కమిషనర్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Kolla Singaiah, Addanki

Kolla Singaiah, Addanki