Santhanuthalapadu: ఎమ్మెల్యే విజయ్ కుమార్ ప్రజాదర్బార్‌కు పోటెత్తిన అర్జీలు

Santhanuthalapadu: ఒంగోలులోని సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ ప్రజా దర్బార్. ఇళ్ల స్థలాలు, పింఛన్ల కోరుతూ అందిన 70 అర్జీలు.

G.V. Naresh Kumar, Prakasam
Published on: 18 Sept 2026 4:37 PM IST
Santhanuthalapadu
X

Santhanuthalapadu: ఎమ్మెల్యే విజయ్ కుమార్ ప్రజాదర్బార్‌కు పోటెత్తిన అర్జీలు

సంతనూతలపాడు: ఎమ్మెల్యే విజయ్ కుమార్ కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్ కు 70 అర్జీలు. ఒంగోలులోని సంతనూతలపాడు శాసనసభ్యులు బి.ఎన్. విజయ్ కుమార్ కార్యాలయం లో శుక్రవారంనాడు జరిగిన ప్రజా దర్బార్ కు నియోజవర్గం పరిధిలోని వివిధ వర్గాలకు చెందిన వివిధ సమస్యలకు సంబంధించి 70 అర్జీలు వచ్చినవి.

బాధితులు ఎమ్మెల్యే విజయ్ కుమార్ కు తమ సమస్యలపై వివరించి అనంతరం అర్జీలను అందజేశారు. ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, నూతన పెన్షన్లు తదితర వాటికి సంబంధించి అధికంగా అర్జీలు వచ్చాయి. సంబంధిత అధికారులతో మాట్లాడి అర్జీదారుల సమస్యలను లను పరిష్కరించనున్నట్టు ఎమ్మెల్యే విజయ్ కుమార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

కొందరు అర్జీదారుల సమస్యలను అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంతనూతలపాడు, నాగులుప్పలపాడు మండలాల టిడిపి అధ్యక్షులు మద్దినేని హరిబాబు, టి .మనోజ్ కుమార్, మద్దిపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు మన్నం రాజేశ్వరి ప్రసాద్, బాపట్ల పార్లమెంట్ టిడిపి ఉపాధ్యక్షులు గొల్లపూడి సుబ్బారావు, సంత నూతలపాడు మండల టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్బూరి శ్రీనివాసరావు, టిడిపి నాయకులు వాసేపల్లి వెంకటేశ్వర్ రెడ్డి, బొడ్డపాటి చంద్రశేఖర్, తక్కల పాటి చిన్న, కాట్రగడ్డ రమణయ్య, మార్పుడి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

G.V. Naresh Kumar, Prakasam

G.V. Naresh Kumar, Prakasam