Devarajugattu: గూడూరి ఎరిక్షన్ బాబు ఆధ్వర్యంలో పసుపు కండువా కప్పుకున్న వైసీపీ నేతలు!
Devarajugattu: ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం దేవరాజుగట్టులో వైసీపీకి భారీ షాక్. ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు ఆధ్వర్యంలో 20 కుటుంబాలు టీడీపీలో చేరాయి.
Devarajugattu: గూడూరి ఎరిక్షన్ బాబు ఆధ్వర్యంలో పసుపు కండువా కప్పుకున్న వైసీపీ నేతలు!
Devarajugattu: యర్రగొండపాలెం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి మరింత బలం చేకూరుతోంది. పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు గ్రామంలో వైసీపీకి చెందిన పలువురు నాయకులు, యాదవ సామాజిక వర్గ ప్రముఖులతో పాటు దాదాపు 20 కుటుంబాలు టీడీపీలో చేరాయి.
యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి *గూడూరి ఎరిక్షన్ బాబు* ఆధ్వర్యంలో వీరంతా వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై విశ్వాసంతో టీడీపీలో చేరినట్లు వారు తెలిపారు.
టీడీపీలో చేరిన వారిలో దేవరాజుగట్టు గ్రామ వైసీపీ మాజీ సర్పంచ్ నంది రెడ్డి రాంరెడ్డి, నంది రెడ్డి రఘురాం రెడ్డి, బట్టగిరి చిన్న రామిరెడ్డి, మహబూబ్ షరీఫ్, వైసీపీ సీనియర్ నాయకుడు గుమ్మ ఆంజనేయులు తదితరులు ఉన్నారు. అలాగే కొత్తపల్లి గ్రామానికి చెందిన పత్తి వెంకటరత్నం, నర్ల రంగారెడ్డి, ఖదీర్ భాష, కరిముల్లా, ఖాసిం పీరా తదితరులు టీడీపీలో చేరారు.
ఈ చేరికలతో పెద్దారవీడు మండలంలో టీడీపీ మరింత బలోపేతమవుతుందని పార్టీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.* గ్రామస్థాయిలో పార్టీకి ప్రజల మద్దతు పెరుగుతోందని గూడూరి ఎరిక్షన్ బాబు పేర్కొన్నారు. దేవరాజుగట్టులో చోటుచేసుకున్న ఈ రాజకీయ పరిణామం మండల రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.




