Rachakonda: ఐసీయూలో కొడుకు.. ప్రాణాలు కాపాడాలంటూ తల్లి వేడుకోలు
Rachakonda: బీర్కూర్ మండలం బరంగేడ్గి గ్రామానికి చెందిన రాచకొండ జ్ఞానేశ్వర్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఐసీయూలో ఉండగా, చికిత్సకు సాయం చేయాలని తల్లి వేడుకుంటోంది.
Rachakonda: ఐసీయూలో కొడుకు.. ప్రాణాలు కాపాడాలంటూ తల్లి వేడుకోలు
Rachakonda: ఈయన పేరు రాచకొండ జ్ఞానేశ్వర్ (ప్రయివేట్ ఉద్యోగి) తండ్రి పేరు పీరయ్య(మేస్త్రి), గ్రామం : బరంగేడ్గి, మండలం :బీర్కూర్, జిల్లా : కామరెడ్డి. మొన్న రాత్రి అనగా తేది : 08-10-2026 గురువారం రోజున ఉద్యోగ రీత్యా తన ద్విచక్ర వాహనంపై బరంగ్ ఎడ్గి గ్రామం నుండి బాన్సువాడకు వెళ్తుండగా మార్గమధ్యలో భైరాపూర్ చౌరస్తా సమీపంలో యాక్సిడెంట్ జరిగి, తలకు బలమైన గాయమయ్యింది.
దీంతో అయనను వెంటనే 108 నందు బాన్సువాడ ఏరియా దవాఖానకు తీసుకెళ్లారు. అనంతరం అక్కడి వైద్యుల సూచనల మేరకు ,నిజామాబాద్ కు తరలించగా, అయన ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అయన ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. పేషెంట్ కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. జ్ఞానేశ్వర్ తండ్రి పీరయ్య కొన్నేండ్ల క్రితం మరణించారు.
అయన తల్లి సాయవ్వకు ఒకే ఒక్క కుమారుడు జ్ఞానేశ్వర్ కాగా ఇద్దరు కుమార్తెలు. ముగ్గురిని పెంచి పెద్ద చేసి చదివించి ఇద్దరు కుమార్తెలకు సైతం వివాహాలు చేసింది. ఇక జ్ఞానేశ్వర్ రూపంలోనే అన్నీ చూసుకుంటూ బ్రతుకుతుండగా, ఇలా జరగడంతో చికిత్సకు డబ్బులు లేక ఆ తల్లి ఇబ్బంది పడుతోంది.
ఈ విషయం తెలిసినవారందరూ తమకు తోచినంతగా సహాయం చేసి ఆదుకోవాలని ఆ తల్లి రెండు చేతులెత్తి వేడు కుంటోoది.దాతలు ఎవరైనా వచ్చి తమ కొడుకు ప్రాణాలను రక్షించాలని ,ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తోంది.




