Rudrur: రుద్రూర్ మండలం అక్బర్ నగర్‌లో యువకుని ఆత్మహత్య!

Rudrur: నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం అక్బర్ నగర్‌లో కుటుంబ కలహాలతో మనస్థాపం చెంది కట్టు రాహుల్ అనే యువకుడు ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

SALEEM, BANSWADA
Published on: 26 Sept 2026 7:32 PM IST
Rudrur
X

Rudrur: రుద్రూర్ మండలం అక్బర్ నగర్‌లో యువకుని ఆత్మహత్య!

Rudrur: మనస్థాపానికి గురై ఇంట్లో ఎవ్వరు లేని సమయం లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని యువకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన రుద్రుర్ మండలం అక్బర్ నగర్ గ్రామంలో చోటు చేసుకుంది. రుద్రూర్ ఎస్సై మనోజ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గ్రామానికి చెందిన కట్టు రాహుల్ (28) అను వ్యక్తి కుటుంబ కలహాలతో మనస్థాపం చెంది, ఇంట్లో ఎవరూ లేని సమయంలో మధ్యాహ్నం బెడ్ రూమ్ లో గల ఫ్యాన్ కి చున్నితో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పంచనామ నిర్వహించి, పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై మనోజ్ కుమార్ వెల్లడించారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA