Bichkunda: పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి
Bichkunda: జుక్కల్ నియోజకవర్గంలో బీజేపీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సమిష్టిగా పనిచేయాలని బిచ్కుందలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
Bichkunda: పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి
బిచ్కుంద (కామారెడ్డి): వచ్చే రెండేండ్లలో జరిగే ఎన్నికల్లో జుక్కల్ నియోజకవర్గం లో భారతీయ జనత పార్టీ విజయమే లక్ష్యంగా పార్టీ ప్రతి కార్యకర్త, నాయకులు సమిష్టిగా పని చేయాలని బిజెపి పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. బుధవారం బిచ్కుంద మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు సెట్పల్లి విష్ణు అధ్యక్షతన నిర్వహించిన మండల స్థాయి బిజెపి పార్టీ మండలస్తాయి సమావేశంలో అయన ముఖ్య అతీతీగ హాజరయ్యారు.
సమావేశంలో భాగంగా అయన మాట్లాడుతు నియోజకవర్గం లో పార్టీ ని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేస్తూ వచ్చే ఎన్నికల్లో బిజెపి గెలుపు కోసం ఇప్పటి నుంచే పక్క ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. ఇప్పటినుండి పార్టీ కార్యక్రమాలను గ్రామస్తాయి లో విస్తృతం చేస్తూ ప్రజల సమస్యలపై నిరంతరం స్పందించాలని దిశ నిర్దేశం చేశారు.
కార్యక్రమం లో బిజెపి పార్టీ మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి రాథోడ్ సునీత, బి జె వై ఎం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడల గంగరాజు, రామగౌడ్, ముప్పడి జ్ఞానేశ్వర్, శ్రీనివాస్,జిల్లా కౌన్సిల్ సభ్యుడు శివాజి పాటిల్,లక్ష్మణ్ చారి, లాలయ్య, గంగాధర్, హన్మాండ్లు, పస్కె ప్రకాష్, మొగులు గొండ, గణపతి, విట్టల్ తోపాటు బిజెపి నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




