Bichkunda: బిచ్కుందలో మురుగు సమస్యపై అడిగితే దాడి
Bichkunda: కామారెడ్డి జిల్లా బిచ్కుంద 7వ వార్డులో మురుగునీటి సమస్య అడిగినందుకు కాలనీవాసులు, మహిళపై కౌన్సిలర్ దాడి చేయగా క్షతగాత్రులను బాన్సువాడ ఆస్పత్రికి తరలించారు.
Bichkunda: బిచ్కుందలో మురుగు సమస్యపై అడిగితే దాడి
బిచ్కుంద (కామారెడ్డి): బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలోని 7 వ వార్డ్ లో కాలనీ రోడ్డు పై మురుగునిటీ సమస్య విషయం పై సంబంధిత కాలనీ వాసులు కౌన్సిలర్ కువివరించేందుకు గాను ఫోన్ ద్వార వివరించగ ఈ విషయం లో సదరు కౌన్సిలర్ కాలనీ వాసులకు, కౌన్సిలర్ కు మధ్య మాటల యుద్ధం పెరిగి ఘర్షణ కు దారితిసింది. కాలనీ మురికి కాల్వలోని నీరు రోడ్డు పై ప్రవహిస్తుండడంతో ఈ సమస్య ను తీర్చాలాంటూ కోరగా కాలనీ వసూలకు చేదు అనుభవం ఎదురైంది.
కౌన్సిలర్ పరుష పదజాలం తో మాట్లాడినట్లు కాలనివాసులు ఆరోపణ చేస్తున్నారు. కాలనివాసులకు అసభ్య పదజాలం తో తిట్టడం తోపాటు కలానికి వచ్చి మీ అందరి అంతు చూస్తానంటూ బెదిరింపుకు పాల్పడి కాలనీ వాసులతో వాగ్వివాదానికి దిగడంతో అక్కడే ఉన్న మహిళ గొడవను అదుపు చేసేందుకు వెళ్లగా ఒక మహిళా అని కూడ చూడ కుండ మానవత్వం మర్చిపోయి కింద తోసివేయ్యడంతో మహిళా కు చేదు అనుభవం ఎదురైంది.
దింతో ఇరువర్గాల మధ్య ఘర్షణలో గాయపడిన కాలనివాసులను స్థానికుల సహాయం తో చికిత్స నిమ్మితం బాన్స్ వాడ ప్రభుత్వ అస్పత్రి కి తరలించి చికిత్స అందిస్తున్నారు. మురికి కాల్వ సమస్య ను పరిష్కరించాల్సిన ప్రజాప్రతినిధులు దాడికి పాల్పడడాంపై విమర్శలు వెళ్లువేత్తుతున్నాయి.




