Kamareddy: అంగన్‌వాడీ నియామకాల్లో ఫేక్ సర్టిఫికెట్ల కలకలం!

Kamareddy: కామారెడ్డి జిల్లా మెక్క గ్రామంలో అంగన్‌వాడీ పోస్టుల భర్తీలో నకిలీ కుల ధృవీకరణ పత్రం సమర్పించారని సీడీపీఓకు సర్పంచ్ ఫిర్యాదు. తహసీల్దార్‌తో విచారణకు డిమాండ్.

VEERANNA, JUKKAL
Published on: 18 Sept 2026 8:14 PM IST
Kamareddy
X

Kamareddy: అంగన్‌వాడీ నియామకాల్లో ఫేక్ సర్టిఫికెట్ల కలకలం!

కామారెడ్డి: బిచ్కుంద మండలం మెక్క గ్రామంలో అంగన్‌వాడీ పోస్టుల భర్తీ ప్రక్రియలో నకిలీ కుల ధృవీకరణ పత్రాలు సమర్పించారని ఆరోపిస్తూ గ్రామ సర్పంచ్ సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. మద్నూర్ ప్రాజెక్ట్ (CDPO)కు వినతిపత్రంఅందజేశారు.గ్రామంలో ఇటీవల జరిగిన అంగన్‌వాడీ టీచర్ పోస్టుల నియామక ప్రక్రియలో ఒక అభ్యర్థి నకిలీ కుల ధృవీకరణ పత్రాన్ని సమర్పించారని సర్పంచ్ ఆరోపించారు. ఆ ధృవీకరణ పత్రంపై అనుమానాలు ఉన్నందున వెంటనే పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని కోరారు.

అభ్యర్థి సమర్పించిన కుల ధృవీకరణ పత్రాన్ని సంబంధిత మండల రెవెన్యూ అధికారి (MRO) ద్వారా రీ-వెరిఫికేషన్ చేయించాలని, అసలు రికార్డులను పరిశీలించి నిజానిజాలు తేల్చాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.

నకిలీ ధృవీకరణ పత్రాల ద్వారా అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరగకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకుని పారదర్శకంగా విచారణ నిర్వహించాలని గ్రామ సర్పంచ్ డిమాండ్ చేశారు.ఈ ఫిర్యాదుపై సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL