Banswada: వర్ని ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే పోచారం!
Banswada: నిజామాబాద్ జిల్లా వర్ని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తనిఖీ చేసి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు.
Banswada: వర్ని ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే పోచారం!
బాన్సువాడ: వర్ని మండల కేంద్రంలోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను స్వయంగా కలిసి వారికి అందుతున్న వైద్య సేవలు, వైద్య సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్యం అందుతుందా లేదా అనే విషయంపై వైద్యులను ఆరా తీశారు.
అనంతరం డీసీహెచ్‌ఓ శ్రీనివాస్ ప్రసాద్ తో మాట్లాడి ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్య సిబ్బంది వివరాలు, అవసరమైన వైద్య సిబ్బంది నియామకం, ఆసుపత్రికి రావాల్సిన వైద్య పరికరాలు, ఇతర మౌలిక సదుపాయాల గురించి చర్చించారు.
ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని, రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వైద్య అధికారులకు పలు సూచనలు చేశారు.




