Nizamabad: కనీస వేతనాల జీవో నెం. 6ను వెంటనే అమలు చేయాలని TUCI డిమాండ్!

Nizamabad: నిజామాబాద్ జిల్లాలో కనీస వేతనాల జీవో నెం. 6ను వెంటనే అమలు చేయాలని TUCI డిమాండ్. ఈనెల 30న కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చిన సంఘం నాయకులు.

M. RAMESH,NIZAMABAD
Published on: 27 Sept 2026 11:19 AM IST
Nizamabad
X

Nizamabad: కనీస వేతనాల జీవో నెం. 6ను వెంటనే అమలు చేయాలని TUCI డిమాండ్!

Nizamabad: రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన కనీస వేతనాల జీవో నెం.06 ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 30న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని డిచ్ పల్లి కేజీబీవీ, మోడల్ స్కూల్ హాస్టల్స్ ల్లో కరపత్రాల ఆవిష్కరణ చేశారు.ఈ సందర్భంగా TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాలు జీవో 6 ను 2026 జూన్ 1వ తేదీ నుండి అమలు చేయాలని గెజిట్ విడుదల చేసిందన్నారు. కోటి మంది పైగా కార్మికులు లబ్ది పొందుతున్నారని ప్రభుత్వం ప్రకటించిందని, కానీ ఈ ప్రకటన కాగితాలకే పరిమితమైందన్నారు. వాస్తవానికి ఈ జీవో ప్రకారం ప్రకటించిన వేతనాలు కార్మికులకు గౌరవప్రద వేతనాలను అందించవన్నారు.

ఈ అతి తక్కువ వేతనాలు కూడా కేజీబీవీ, యుఆర్ఎస్, మోడల్ స్కూల్ హాస్టల్స్ ల్లో అమలు కావడం లేదన్నారు. ఇప్పటికైనా కనీసం జీవో నెంబర్ 6 ను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈనెల 30న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించాలని టియుసిఐ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిందన్నారు. అందులో భాగంగా ఈనెల 30న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టియుసిఐ జిల్లా సహాయ కార్యదర్శి డి.కిషన్ కేజీబీవీ, మోడల్ స్కూల్ హాస్టల్స్ సిబ్బంది విజయ, సుజాత, పార్వతి, స్వప్న, మంజుల, కమల, పద్మ, రాజమణి, స్వరూప తదితరులు పాల్గొన్నారు.

M. RAMESH,NIZAMABAD

M. RAMESH,NIZAMABAD