Jukkal: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను కలిసిన గులని సాయిలు!

Jukkal: ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను టీపీసీసీ ఎస్సీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గులని సాయిలు మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.

VEERANNA, JUKKAL
Published on: 14 Oct 2026 7:37 PM IST
Jukkal
X

Jukkal: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను కలిసిన గులని సాయిలు!

Jukkal: నేషనల్ (కామారెడ్డి )అల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ జతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లకార్జున్ ఖర్గే ను టి పి సి సి ఎస్సి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గులని సాయిలు మర్యాద పూర్వకంగా కలిసి ఆసిస్సులు తీసుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన 'మార్చ్ ఫర్ డెమోక్రసీ ', 'ఓట్ చోరీ 'నిరసన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ విలువలు కాపాడటంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టుతున్న కార్యక్రమాల్లో మరింత క్రియాశీలకంగా పాల్గొంటు, పార్టీ బలోపేతానికి క్రమశిక్షణ తో అంకితభావంతో పని చెయ్యాలని ఖర్గే సూచించినట్లు సాయిలు తెలిపారు. తను కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతలకు కట్టుబడి, సామాజిక న్యాయం, అణగారిన వర్గాల హక్కుల కోసం పార్టీ ఆదేశించిన ఆదేశాలకు కట్టుబడి నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్బంగా తెలుపుతు పార్టీ అగ్రనాయకత్వం చూపుతున్న మార్గదర్శకత్వంలో జుక్కల్ నియోజకవర్గం తోపాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL