Banswada: బాన్సువాడలో ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం!

Banswada: బాన్సువాడలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం ఘనంగా జరిగింది. ఆర్డీఓ రవీందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు.

SALEEM, BANSWADA
Published on: 17 Sept 2026 12:41 PM IST
Banswada
X

Banswada: బాన్సువాడలో ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం!

బాన్సువాడ: తెలంగాణ చరిత్రలో కీలకమైన సెప్టెంబర్ 17ను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం గా అధికారికంగా నిర్వహిస్తోంది. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనం కావడంతో ప్రజాస్వామ్య పాలనకు మార్గం సుగమమైన చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాలు నిర్వహించారు.

జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బాన్సువాడ డివిజన్ కార్యాలయంలో ఆర్డీఓ రవీందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. అధికారులు,సిబ్బంది పాల్గొని జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ 1948 సెప్టెంబర్ 17న ప్రజాస్వామ్య పాలనకు నాంది పలికిన చారిత్రక ఘట్టాన్ని, ప్రజల హక్కులు, స్వేచ్ఛ, ఆత్మగౌరవం కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ తెలంగాణ అభివృద్ధి కోసం కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మెన్ కాసుల్వార్ విజయ, తెలంగాణ ఆగ్రో చైర్మన్ కాసుల బాలరాజు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA