Bodhan: బోధన్‌లో మెడికల్ కౌన్సిల్ మెరుపు దాడులు: నకిలీ క్లినిక్‌లు సీజ్

Bodhan: నిజామాబాద్ జిల్లా బోధన్, ఎడపల్లిలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందాలు మెరుపు దాడులు నిర్వహించి అనధికార క్లినిక్‌లు, నకిలీ వైద్యుల దందాను బట్టబయలు చేశాయి.

K RAVI, BODHAN
Published on: 5 Nov 2026 9:49 PM IST
Bodhan
X

Bodhan: బోధన్‌లో మెడికల్ కౌన్సిల్ మెరుపు దాడులు: నకిలీ క్లినిక్‌లు సీజ్

బోధన్, నిజామాబాద్ జిల్లా: తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (TGMC) ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం, ఎడపల్లి మరియు పరిసర ప్రాంతాల్లో అనధికార వైద్యులపై విస్తృత తనిఖీలు నిర్వహించారు. కౌన్సిల్‌కు చెందిన రెండు ప్రత్యేక బృందాలు ఏకకాలంలో రంగంలోకి దిగి పలు క్లినిక్‌లు, ఫస్ట్ ఎయిడ్ సెంటర్లపై ఆకస్మిక దాడులు చేపట్టాయి.

అర్హతలు, చట్టబద్ధమైన వైద్య రిజిస్ట్రేషన్ లేకుండానే వైద్యులుగా చలామణి అవుతూ వైద్య సేవలు అందిస్తున్న వ్యక్తులను తనిఖీల్లో గుర్తించారు.

తనిఖీలు నిర్వహించిన కేంద్రాలు:

1. బాలరాజ్ క్లినిక్ – ఎడపల్లి

2. సైలూ (శ్రీ సాయి ఫస్ట్ ఎయిడ్ క్లినిక్) – ఎడపల్లి

3. శ్రీ సాయి కృప క్లినిక్ – బుద్దె హనుమాండ్లు, బోధన్

4. ధనలక్ష్మి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ – కమ్మరి బాలరాజ్, బోధన్

5. ప్రగతి ఐ హాస్పిటల్ – రాకాసిపేట్

* జయవాణి, అరుణ్ రామ్ అనే ఆప్టోమెట్రీ టెక్నీషియన్లు కంటి వైద్య నిపుణులు లేకుండానే కంటి వైద్య సేవలు అందిస్తున్నట్లు తనిఖీల్లో గుర్తించారు.

1. లయన్స్ హాస్పిటల్ – రాకాసిపేట్

* యోగేష్ రాథోడ్ అనే ఆప్టోమెట్రీ టెక్నీషియన్ కంటి వైద్య సేవలు అందిస్తున్నట్లు గుర్తించారు.

1. మనసా పైల్స్ క్లినిక్ – అమిత్ కుమార్

2. నర్సింలు క్లినిక్ – రాకాసిపేట్

3. నరసింహారెడ్డి క్లినిక్ – పాత బస్టాండ్

హైఎండ్ యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ గుర్తింపు – ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు

తనిఖీల సందర్భంగా సంబంధిత కేంద్రాల్లో హైఎండ్ యాంటీబయాటిక్స్ (High-end Antibiotics), స్టెరాయిడ్స్, నొప్పినివారణ మందులు వంటి శక్తివంతమైన మందులు విచ్చల విడిగా వినియోగిస్తునట్టు గుర్తించి తగు సాక్షాలు సేకరించారు .

వైద్యపరమైన అర్హతలు లేని వ్యక్తులు ఇలాంటి మందులను వినియోగించడం ప్రజల ప్రాణాలకు తీవ్ర ముప్పుగా పరిణమిస్తుంది. విచక్షణారహిత యాంటీబయాటిక్స్ వినియోగం యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ (AMR) పెరుగుదలకు కూడా కారణమవుతుంది.

చట్టపరమైన చర్యలు

వైద్య అర్హతలు, రిజిస్ట్రేషన్ లేకుండా వైద్య సేవలు అందిస్తున్న వారిపై సంబంధిత చట్టాలు TMPR 22, NMC 34,54 ప్రకారం కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. ప్రజారోగ్యానికి హాని కలిగించే అనధికార వైద్య విధానాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ స్పష్టం చేస్తోంది.

నకిలీ వైద్యులపై సమాచారం కొరకు 9154382727 నెంబర్ కి వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వాలని డాక్టర్ పేర్కొన్నారు.

ప్రజలకు విజ్ఞప్తి:

ప్రజలు వైద్య సేవలు పొందే ముందు వైద్యుల అర్హతలు, రిజిస్ట్రేషన్ వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలి. అర్హత కలిగిన, రిజిస్టర్డ్ వైద్యుల వద్ద మాత్రమే చికిత్స పొందాలి.

ప్రజల ఆరోగ్య భద్రతే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ప్రధాన లక్ష్యం. అనధికార వైద్యానికి అడ్డుకట్ట వేయడానికి కౌన్సిల్ తనిఖీలు చేస్తున్నట్లు మెడికల్ కౌన్సిల్ అధికారులు వెల్లడించారు.

K RAVI, BODHAN

K RAVI, BODHAN