Banswada: బాన్సువాడలో ఘనంగా ప్రారంభమైన సువర్ణ భూమి శబరిమల మహా పాదయాత్ర!

Banswada: బాన్సువాడ శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం నుండి శబరిమల వరకు ప్రారంభమైన సువర్ణ భూమి శబరిమల మహా పాదయాత్రను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.

SALEEM, BANSWADA
Published on: 5 Nov 2026 4:42 PM IST
Banswada
X

Banswada: బాన్సువాడలో ఘనంగా ప్రారంభమైన సువర్ణ భూమి శబరిమల మహా పాదయాత్ర!

Banswada: బాన్సువాడ పట్టణ కేంద్రంలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి.

అనంతరం బాన్సువాడ నుండి పవిత్ర శబరిమల క్షేత్రం వరకు పాదయాత్రగా బయలుదేరుతున్న సువర్ణ భూమి శబరిమల మహా పాదయాత్ర కు ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రోస్ మాజీ చైర్మన్ కాసుల బాలరాజు , బాన్సువాడ RDO రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బాన్సువాడ పట్టణ నాయకులు, ప్రజాప్రతినిధులు, అయ్యప్ప గురుస్వాములు, స్వాములు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA