Nizamabad: ఖాజాపూర్ వద్ద ఆర్టీసీ బస్సు కోసం విద్యార్థుల ఆందోళన!
Nizamabad: నిజామాబాద్ జిల్లా సాలూర మండలం ఖాజాపూర్ వద్ద సరైన బస్సు సౌకర్యం లేక విద్యార్థులు ఆందోళనకు దిగారు. పోలీసుల హామీతో ధర్నా విరమించారు.
Nizamabad: ఖాజాపూర్ వద్ద ఆర్టీసీ బస్సు కోసం విద్యార్థుల ఆందోళన!
Nizamabad: సాలూర మండలంలోని ఖాజాపూర్ గ్రామం వద్ద విద్యార్థులు ఆర్టీసీ బస్సు సౌకర్యం కోసం బుధవారం ఆందోళనకు దిగారు. సుంకిని నుంచి సాలూర మీదుగా బోధన్ తదితర ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులు సరిపడా లేకపోవడంతో నిత్యం లేక పోవడం తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే సమయాల్లో బస్సుల కోసం ఎక్కువసేపు వేచి చూడాల్సి వస్తోందని, బస్సులు వచ్చినప్పుడు అధిక రద్దీ కారణంగా ప్రయాణం కష్టంగా మారుతోందని పేర్కొన్నారు.
విద్యార్థులు ఖాజాపూర్ గ్రామం లో ఆర్టీసీ బస్సును అడ్డుకుని, బస్సు ముందు కూర్చొని నిరసన తెలిపారు. విద్యార్థుల ఆందోళనతో కొద్దిసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న బోధన్ రూరల్ పోలీసులు ఎస్సై రాజశేఖర్ సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు.
విద్యార్థుల సమస్యను సంబంధిత ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి, డీఎంతో మాట్లాడి అదనపు బస్సు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని ఎస్సై హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు తమ ఆందోళనను విరమించారు.




