Bichkunda: SIR సర్వేలో పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యం: తహసీల్దార్‌కు ఫిర్యాదు

Bichkunda: ఎస్ఎస్ఆర్ ఓటర్ల నమోదు సర్వేలో శాంతాపూర్ పంచాయతీ కార్యదర్శి సంతోష్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ BLA రవి బిచ్కుంద తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు.

VEERANNA, JUKKAL
Published on: 18 Sept 2026 6:21 PM IST
Bichkunda
X

Bichkunda: SIR సర్వేలో పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యం: తహసీల్దార్‌కు ఫిర్యాదు

బిచ్కుంద (కామారెడ్డి ): ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న SIR సర్వేలో శాంతాపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతోష్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ BLA రవి బిచ్కుంద తహసీల్దార్ (MRO)వేణుకువినతిపత్రంఅందజేశారు.

గ్రామంలో నూతన ఓటర్ల నమోదు చేయాలని కోరగా, “నేను చేయను.. మీరే మీ సేవకేంద్రానికివెళ్లిఆన్‌లైన్‌లో నమోదు చేసుకోండి” అంటూ గ్రామకార్యదర్శిసమాధానంఇచ్చారనిరవిఆరోపించారు. దీంతో ఓటర్ల నమోదు ప్రక్రియలో గ్రామ కార్యదర్శి పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలిపారు.

SIR సర్వేలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నూతన ఓటర్ల నమోదును అధికారులు సక్రమంగా నిర్వహించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించిన గ్రామ పంచాయతీ కార్యదర్శిపై తక్షణమే తగిన చర్యలు తీసుకుని విధుల నుంచి తొలగించాలని కాంగ్రెస్ పార్టీ BLA రవి MRO వేణు ను కోరారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL