Banswada: బాన్సువాడలో ఘనంగా శ్రీనివాస ట్యుటోరియల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం

Banswada: కామారెడ్డి జిల్లా బాన్సువాడలో శ్రీనివాస ట్యుటోరియల్ 1996-97 పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది.

SALEEM, BANSWADA
Published on: 11 Oct 2026 6:12 PM IST
Banswada
X

Banswada: బాన్సువాడలో ఘనంగా శ్రీనివాస ట్యుటోరియల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం

బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని, శ్రీనివాస ట్యుటోరియల్ కాలేజీలో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఈ రోజు వారు ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరుపుకున్నారు. ఎస్ఎస్సి బ్యాచ్ 1996 - 97 సంవత్సరంలో చదువుకున్నవారు 30 వసంతాల తర్వాత ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకొని,ఒకరినొకరు బాగోగులను,వారు చేస్తున్న వృత్తులను పరిచయం చేసుకొని,వారి బాగోగులను తెలుసుకున్నారు. బాన్సువాడ పట్టణంలో ఒకప్పుడు ఈ కాలేజీ కు ప్రత్యేకత ఉండేది.

శ్రీనివాస ట్యుటోరియల్ కాలేజీలో అప్పుడు బోధించినటువంటి ఉపాధ్యాయులు. విద్యార్థులు కలిసి ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఘనంగా నిర్వహించడం అభినందనీయమని ,వారి గురువులు అన్నారు. 30 సంవత్సరాల క్రితం నాటి మధుర స్మృతులను స్మరించుకుంటూ చదివిన పాఠశాలలోనే ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది చాలా హర్షించదగ్గ విషయం ,చాలా ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో అప్పటి బోధించినటువంటి ఉపాధ్యాయులు అదేవిధంగా బ్యాచ్ కమిటీ సభ్యులు , విద్యార్థులు పాల్గొన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA