Jukkal: తెలంగాణ సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడిగా సోమయప్ప స్వామి ఎన్నిక!
Jukkal: హైదరాబాద్ కాచిగూడలో జరిగిన సాధు పరిషత్ సమావేశంలో బిచ్కుంద కాశీ విశ్వనాథ ఆలయ పీఠాధిపతి సోమలింగ శివాచార్య స్వామి (సోమయప్ప స్వామి) రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
Jukkal: తెలంగాణ సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడిగా సోమయప్ప స్వామి ఎన్నిక!
Jukkal: బిచ్కుంద (కామారెడ్డి ) రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని కాచిగూడ శ్యాం బాబా మందిరం లో నిర్వహించిన తెలంగాణ లొని వివిధ మఠలు, పీఠలు, సంప్రదాయాలకు చెందిన సాధు సంతులు, స్వామీజీల సమావేశం నిర్వహించారు.సమావేశం లో భాగంగా పాల్గొన్న స్వామీజీల అభిప్రాయాలు సూచనల మేరకు నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
ఎన్నికైన నూతన కార్యవర్గంలో భాగంగా బిచ్కుంద కాశీ విశ్వనాథ ఆలయ పిఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ 108 సద్గురు సోమలింగ శివ చార్య స్వామి రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైనట్లు విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర ధర్మ చార్య సంపర్క ప్రముఖ్ పడుగుల బాలస్వామి తెలిపారు. ఈ సందర్బంగా బాలస్వామి మాట్లాడుతు ప్రస్తుతం హిందూ ధర్మం అనేక సవాళ్ళను, సమస్యలను ఎదుర్కొంటుందని,వాటి పరిష్కరానికి సాధు పరిషత్ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునీచ్చారు.
రాష్ట్రంలోని మఠ లు, పీఠ లు, వివిధ సంప్రదాయాల మధ్య సమన్వయం పెంపోందిస్తూ సాధు సంతుల ఐక్యత ను బలోపేతం చేయాలని సూచించారు. హిందూ ధర్మ పరిరక్షణ, ధార్మిక సంప్రదాయాల పరిరక్షణ, దేవాలయాల సమస్యలు, హిందూ సమాజం ఎదుర్కొంటున్న ఇబ్బందుల పరిష్కారం, ధార్మిక చైతన్య వ్యాప్తి వంటి అంశాలపై సాధు పరిషత్ ప్రత్యేక ద్రుష్టి సారించాలని ఆకాంక్షించారు.
రాష్ట్ర వ్యాప్తంగా జరిగే హిందూ ధార్మిక కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటు ధర్మ ప్రచారం, ధర్మ జాగరణ కోసం ఈ కమిటి పనిచేయాలని కోరారు.నూతనంగా ఎన్నికైన సాధు పరిషత్ రాష్ట్ర కార్యవర్గం రాష్ట్ర అధ్యక్షులు. సోమయప్ప స్వామి, ఉపాధ్యక్షులు చంద్ర మౌళిశ్వర స్వామి, రాఘోత్తమ స్వామి,వీర ధర్మజ స్వామి,ప్రధాన కార్యదర్శి శివానంద స్వామి, సహాయ కార్యదర్శి కృష్ణనంద బ్రహ్మ చారి, కోశాధికారి శ్రీ మహాదేవ స్వామి నిజ నిర్ధారణ కమిటి సభ్యులుగా కైవల్యానంద స్వామి లు ఎన్నికైనట్లు బాలస్వామి తెలిపారు.
దీపావళి అనంతరం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించి కమిటీని మరింత విస్తరించునున్నట్లు బాలస్వామి తెలిపారు. తెలంగాణ లొని అన్ని జిల్లాలకు అన్ని హిందూ సంప్రదాయాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ మరింత మంది స్వామీజీలను కార్యవర్గంలో తీసుకుంటామని వెల్లడించారు. ఈ నూతన కార్యవర్గం మూడు సంవత్సరాలపాటు కొనసాగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమం లో విశ్వహిందూ పరిషత్ నాయకులు రామరాజు, వి హెచ్ పి కేంద్రియ మార్గదర్శక మండలి సభ్యులు సంగ్రామ్ మహారాజ్, బెనారస్ గురూజీ స్వామి , దుర్గానందపురి మహారాజ్లు పర్యవేక్షకులుగా వ్యవహారించారు.




