Bichkunda: బిచ్కుందలో ఎస్సై రాజు ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల క్యాండిల్ ర్యాలీ!
Bichkunda: కామారెడ్డి జిల్లా బిచ్కుందలో ఎస్సై గుండెల రాజు ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ క్యాండిల్ ర్యాలీ. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని ఎస్సై వెల్లడి.
Bichkunda: బిచ్కుందలో ఎస్సై రాజు ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల క్యాండిల్ ర్యాలీ!
Bichkunda: బిచ్కుంద (కామారెడ్డి ) పోలీస్ అమరవీరుల వారోత్సవాల ముగింపు సందర్బంగా రాష్ట్ర డి జి పి ఆదేశాల మేరకు శనివారం రాత్రి బిచ్కుంద ఎస్సై గుండెల రాజు ఆధ్వర్యంలో బిచ్కుంద పట్టణం లోని ప్రధాన విధుల గుండ అంబేద్కర్ చౌక్ వరకు పోలీస్ సిబ్బంది, యువకులు కలిసి క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించు కుంటు వారికి ఘనంగా నివాళులర్పించారు.
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని వారి సేవలు మనందరికీ స్ఫూర్తి దయాకమన్నారు.ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణ లో భాగంగా తమ ప్రాణాలు సైతం త్యాగం చేసిన పోలీస్ అమరవీరుల ప్రాణ త్యాగాలను భావితరాలకు తెలియజేయ్యడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వారి త్యాగాల వల్లే నేడు సమాజం లో ప్రశాంత వాతావరణం నెలకొందని ఎస్సై పేర్కొన్నారు.పోలీస్ అమరవీరుల త్యాగాలు, ఆశయాలు ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకొని విధి నిర్వహణలో బాధ్యత యుతంగా మెలగాలని శాంతి భద్రత కాపాడేకోసం ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. కార్యక్రమం లో ఏ ఎస్సై దేవరాజ్, పోలీస్ సిబ్బంది, యువకులు పాల్గొన్నారు.




