Banswada: బాన్సువాడలో అరుదైన శస్త్రచికిత్స: 45 ఏళ్ల మహిళకు ఊరట!

Banswada: కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో అత్యంత అరుదైన ‘పెరిన్యూరోమా’ శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు.

SALEEM, BANSWADA
Published on: 4 Oct 2026 8:11 PM IST
Banswada
X

Banswada: బాన్సువాడలో అరుదైన శస్త్రచికిత్స: 45 ఏళ్ల మహిళకు ఊరట!

బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని ప్రైవేటు ఆసుపత్రిలో ఒక అరుదైన శస్త్ర చికిత్స ను డాక్టర్లు విజయవంతంగా చేశారు.చాలా అరుదైన దంతాలకు సంబంధించిన రోగం అని, ప్రపంచంలో 39 మందికి మాత్రమే పెరిన్యూరోమా అనే (Perineurioma)సర్జరీలు జరిగాయని,వారు తెలిపారు.డాక్టర్ సాయి కృష్ణ మాట్లాడుతూ,దంత రోగాల్లో ఇది ఒకటని, పాలటల్ రీజియన్ (Palatal region) లో ఇదే ప్రపంచం మొత్తంలో మొదటి శాస్త్ర చికిత్స అని డాక్టర్ సాయి కృష్ణ తెలిపారు.

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో 7 హిల్స్ హాస్పిటల్‌ లో ముఖము దవడ సర్జరీ నిపుణులు డాక్టర్ సాయి కృష్ణ,మరియు విశాల్ సింగ్ తో కలసి ఒక 45 ఏళ్ల మహిళ కు పెరిన్యూరోమా (Perineurioma) అనే అరుదైన శాస్త్ర చికిత్స ను మొట్టమొదటి సారిగా నిర్వహించారు.పెరిన్యూరోమా తో బాధపడే వారు నీరు మరియు ఆహార పదార్థాలను మింగడానికి ఇబ్బందిపడుతూ ఉంటారని చెప్పారు.

ఈ పెరిన్యూరోమా (Perineurioma) ద్వారా ఇప్పటివరకు ప్రపంచంలో 39 మందికి మాత్రమే ఇలాంటి సర్జరీలు జరిగాయని అన్నారు. ఇందులో పాలటల్ రీజియన్ (Palatal region) లో ఇదే ప్రపంచం మొత్తంలో మొదటి శాస్త్ర చికిత్స అన్నారు. ఇలాంటి సర్జరీ చేసేందుకు మారుమూల ప్రాంతాల్లో సేవలందించేందుకు సేవన్ హిల్స్ దావా ఖానాలో అన్ని వసతులు కల్పించారని చెప్పారు.ప్రజలు దీన్ని వినియోగించుకోవాలని వారు తెలిపారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA