Pitlam: సేవా భావమే సమాజాభివృద్ధికి పునాది: ఎమ్మెల్యే తోట
Pitlam: సేవాభావమే సమాజాభివృద్ధికి పునాది అని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. పిట్లం ప్రభుత్వ ఆసుపత్రికి దాత విరాళంగా ఇచ్చిన ఫ్రిడ్జ్‌ను ప్రారంభించారు.
Pitlam: సేవా భావమే సమాజాభివృద్ధికి పునాది: ఎమ్మెల్యే తోట
పిట్లం (కామారెడ్డి): తమ వంతు బాధ్యత గా మానవత్వ దృక్పధం తో పిట్లం ప్రభుత్వ అస్పత్రి లో చేపట్టిన సేవా కార్యక్రమం లో భాగంగా పిట్లం మండల కేంద్రానికి చెందిన కొంతం రాజ్ కుమార్ గుప్తా (దుబాయి రాజు ) తన తండ్రి జ్ఞాపకార్ధం రిప్రిజీరేటర్ ను విరాళంగా అందివ్వడం హర్షించందగ్గ విషయమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు.
గురువారం పిట్లం ప్రభుత్వ అస్పత్రి లో వైద్య సేవలకోసం ఉపయోగపడే రిప్రిజీరేటర్ ను విరాళంగా అందించడం పట్ల పలువురు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా నూతన రిప్రిజీరేటర్ ను జుక్కల్ ఎమ్మెల్యే చేతుల మీదుగా రిబ్బన్ కట్ చెయ్యగా డి సి సి అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ హాజరై రిప్రిజీరేటర్ ను ప్రారంభించి అస్పత్రి లో రోగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకుదాతృత్వం తో ప్రభుత్వ అస్పత్రి కి సహకారం అందించిన ఇలాంటి దాతలు ముందుకు రావడం అభినందనియమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ప్రభుత్వ అస్పత్రులకు అవసరమైన సౌకర్యాలు సమాకుర్చడంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని, సమాజానికి ఉపయోగపడే ఇలాంటి సేవ కార్యక్రమాలు మరింత మందికి స్ఫూర్తి నిస్తాయని నాయకులు తెలిపారు. కార్యక్రమం లో పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ చికోటి మనోజ్ కుమార్,సర్పంచ్ చంద్ర శేఖర్, మండల కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఇతర నాయకులు, స్థానికులు, అస్పత్రి వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




