Rudrur: డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో దళారులను నమ్మి మోసపోవద్దు

Rudrur: రుద్రూర్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులో దళారులను నమ్మి మోసపోవద్దన్న సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్. అధికారుల సమక్షంలో డ్రా ద్వారా పంపిణీ.

SALEEM, BANSWADA
Published on: 16 Sept 2026 8:54 PM IST
Rudrur
X

Rudrur: డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో దళారులను నమ్మి మోసపోవద్దు

రుద్రూర్: అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అందజేయాలని, దళారులను నమ్మి మోసపోవద్దని గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్ సూచించారు. రుద్రూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్ బుధవారం సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ.. డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు దళారులను నమ్మి మోసపోవద్దని అన్నారు. కొంతమంది నాయకులు కుల సంఘాలతో సమావేశమై అసలైన నిరుపేదలకు కాకుండా, అనర్హుల పేర్లు నమోదు చేసి అవకతవకలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.

గతంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ విషయంలో అవకతవకలకు పాల్పడిన సందర్భాలు ఉన్నాయని ఆమె సూచించారు. కావున లబ్ధిదారులు దళారులను నమ్మి మోసపోవద్దని అన్నారు. ఇప్పుడు ఎలాంటి అవకాతవకలకు పాల్పడకుండా గ్రామ సభ ఏర్పాటు చేసి,అధికారుల సమక్షంలోనే డ్రా తీసి పంపిణీ చేస్తామని అన్నారు.

జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి,ఆర్డీవో, తహసీల్దార్, గ్రామ పెద్దల సమక్షంలో డ్రా నిర్వహించి, లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేసే విధంగా కృషి చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో ఉప సర్పంచ్ షేక్ నిస్సార్, వార్డు మెంబర్లు పర్వీన్ బేగం, ఆమంద్ వెంకటేష్, కోతి పార్వతి, పార్వతి పూజిత, బొంబాయి విమల, కుర్ల పోశెట్టి, వడ్ల అమృత, బక్క శివకుమార్, గొర్ల కృష్ణ, సాగరిక పాల్గొన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA