Rudrur: రుద్రూర్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
Rudrur: నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు; అధ్యక్షుడిగా శ్యామ్ సుందర్ పహడే ఎన్నికయ్యారు.
Rudrur: రుద్రూర్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
నిజామాబాద్ జిల్లా: రుద్రూర్ మండల ప్రెస్‌క్లబ్ నూతన కార్యవర్గాన్ని మండల కేంద్రంలో ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్ట్ నూతి పల్లి గణేష్(సాక్షి), అధ్యక్షుడిగా శ్యామ్ సుందర్ పహడే(SSP), ప్రధాన కార్యదర్శిగా భీమ్ రావు యాదవ్(మన తెలంగాణ), ఉపాఽధ్యక్షులుగా లాల్ మొహమ్మద్(జనం న్యూస్), కోశాధికారిగా సూరజ్ శ్రీనివాస్(ఆంధ్రప్రభ), సహాయ కార్యదర్శి శేఖర్(K6), సలహాదారులుగా నగేష్(ఈనాడు), తాహెర్(ఆంధ్రజ్యోతి)తో పాటు నూతన కమిటీ సభ్యులు ఉమాకాంత్, సతీష్, శ్రీకాంత్, శేఖర్, లింగాల శంకర్, గౌస్ తదితరులు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని,అందరూ అభినందనలు,శుభాకాంక్షలు తెలిపారు.




