Nizamabad: పాత వర్నిలో పంట పొలాలను పరిశీలించిన రుద్రూర్ అగ్రికల్చర్ విద్యార్థులు!

Nizamabad: నిజామాబాద్ జిల్లా వర్ని మండలం పాత వర్నిలో రుద్రూర్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ విద్యార్థులు పంట పొలాలను సందర్శించి సాగు విధానాలను పరిశీలించారు.

SALEEM, BANSWADA
Published on: 3 Oct 2026 3:33 PM IST
Nizamabad
X

Nizamabad: పాత వర్నిలో పంట పొలాలను పరిశీలించిన రుద్రూర్ అగ్రికల్చర్ విద్యార్థులు!

Nizamabad: నిజామాబాద్ జిల్లా వర్ని మండలం పాత వర్ని శివారులోని పంట పొలాలను సందర్శించారు. రుద్రూర్ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు క్షేత్ర స్థాయి అనుభవ కార్యక్రమంలో భాగంగా,క్షేత్ర స్థాయిలో వ్యవసాయ పంట పొలాలను సందర్శించి,పంటల పరిస్థితులను పరిశీలించారు.

రైతుల వరి సాగు విధానం,పంట ఎదుగుదల,రైతులు వారి సాగుకు అనుసరిస్తున్న సాగు పద్ధతులు,సాగులో రైతులకు ఎదురవుతున్న సమస్యలను విద్యార్థులు నేరుగా రైతులకు అడిగి తెలుసుకున్నారు.ప్రత్యక్షంగా క్షేత్ర స్థాయి లో పర్యటించడం ద్వారా వారు తరగతి గదిలో నేర్చుకున్న,వ్యవసాయ విజ్ఞానాన్ని ఆచరణాత్మకంగా అర్థం చేసుకోవడానికి,వారికి అవకాశ లభించిందని విద్యార్థులు అన్నారు.ఈ సందర్భంగా రైతులు తమ సాగు అనుభవాలు,ఎదురవుతున్న సమస్యలు విద్యార్థులతో పంచుకున్నారు.

ఈ క్షేత్ర స్థాయి పర్యటన ద్వారా తమకు అనేక అనుభవాలు లభించాయని అన్నారు.

ఈ క్షేత్ర స్థాయి పర్యటన కార్యక్రమంలో రైతులు,ప్రజా ప్రతినిధులు,గ్రామ ప్రజలతో పాటు,వ్యవసాయ విద్యార్థులు బీ.నిహారిక,పీ జయ శ్రీ,డీ అఖిల, జే నిఖిత,ఆర్ అభినయ, తదితర వ్యవసాయ విద్యార్థులు పాల్గొన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA