Rudrur: రుద్రూర్ నూతన ఎంఈవోగా ఆది నారాయణ రెడ్డి బాధ్యతల స్వీకరణ
Rudrur: నిజామాబాద్ జిల్లా రుద్రూర్ నూతన మండల విద్యాధికారిగా ఆది నారాయణ రెడ్డి బాధ్యతల స్వీకరణ; విద్యాభివృద్ధి, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడి.
Rudrur: రుద్రూర్ నూతన ఎంఈవోగా ఆది నారాయణ రెడ్డి బాధ్యతల స్వీకరణ
రుద్రూర్: నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల నూతన విద్యాధికారిగా ఈ రోజు ఆది నారాయణ రెడ్డి పదవీ బాధ్యతలను స్వీకరించారు.ఇంతవరకు పదవీ బాధ్యతలు నిర్వహించిన పీ.రాంసింగ్ నుండి బాధ్యతలను స్వీకరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ,మండలం లోని ఉపాధ్యాయులతో కలిసి,విద్యాభివృద్ధికి కృషి చేస్తానని,ఎల్ల వేళలా అందుబాటులో ఉంటూ,అందరి సహకారం తో ముందుకు వెళుతానని అన్నారు.ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.అనంతరం ఉపాధ్యాయులు ఆయనను పూల మాల,శాలువాతో ఘనంగా సన్మానించారు.




