Tadkole: రాజారాం దుబ్బా పాఠశాలలో PTM ఉపసర్పంచ్ షేక్ సాజీద్ హాజరు

Tadkole: రాజారాం దుబ్బా ప్రాథమిక పాఠశాలలో PTM సమావేశం. విద్యార్థుల ప్రగతి నివేదికల పంపిణీ, పిల్లల భద్రతపై అవగాహన కల్పించిన ఉపసర్పంచ్ షేక్ సాజీద్.

SALEEM, BANSWADA
Published on: 5 Nov 2026 10:47 PM IST
Tadkole
X

Tadkole: రాజారాం దుబ్బా పాఠశాలలో PTM ఉపసర్పంచ్ షేక్ సాజీద్ హాజరు

తాడ్కోల్: రాజారాం దుబ్బా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో (కక్షలు 1 నుండి 5) విద్యార్థుల ప్రగతి నివేదికల (Progress Reports) పంపిణీ కొరకు తల్లిదండ్రుల-ఉపాధ్యాయుల సమావేశం (PTM) ఘనంగా నిర్వహించారు. తాడ్కోల్ గ్రామ ఉపసర్పంచ్ శ్రీ షేక్ సాజీద్ ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఉపసర్పంచ్ షేక్ సాజీద్ మాట్లాడుతూ, విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ ఈ సమావేశానికి విశేషంగా తరలిరావడం అభినందనీయమని అన్నారు. పిల్లల భవిష్యత్తు కోసం అహర్నిషలు శ్రమిస్తున్న పాఠశాల ఉపాధ్యాయ బృందానికి గ్రామ పంచాయతీ తరఫున ధన్యవాదాలు తెలియజేశారు.

అలాగే, పిల్లల విద్యతో పాటు వారి ప్రాణ భద్రత ,వారి ఆరోగ్యం కూడా మనకు అత్యంత ముఖ్యం అని పేర్కొంటూ సర్పంచ్ తరఫున పాఠశాల ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు మరియు గ్రామ ప్రజలకు ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేశారు.

మన ప్రాంతంలో అడవి పందుల వేట కోసం కొందరు ఉపయోగించే "నాటు బాంబులు" (విస్పోటకాలు) ఇటీవల పొరపాటున పేలి ప్రమాదం జరిగినందున, పిల్లలకు ఈ ప్రమాదం గురించి ఉపాధ్యాయులు ప్రతిరోజూ అసెంబ్లీలోవిద్యార్థులకు అవగాహన కల్పించాలని,దారిలో లేదా పొలాల్లో కనిపించే ఎలాంటి కొత్త వస్తువులను లేదా పొట్లాలను తాకకూడదని వారికి చెప్పాలన్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల కదలికలపై అప్రమత్తం గా ఉంటూ ప్రత్యేక నిఘా ఉంచాలని, ఇంటి పరిసరాల్లో పారిశుధ్యం పట్ల తగిన జాగ్రత్తలు వహించాలని కోరారు.

గ్రామంలో ఎవరైనా నాటు బాంబులు తయారుచేస్తున్నట్లు లేదా కలిగి ఉన్నట్లు తెలిస్తే వెంటనే గ్రామ పంచాయతీకి గానీ, పోలీసులకు గానీ సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. మన ఊరి పిల్లలకు మంచి విద్య మరియు సురక్షితమైన వాతావరణం అందించడానికి సర్పంచ్ నాయకత్వంలో గ్రామ పంచాయతీ ఎల్లప్పుడూ ముందుంటుందని సర్పంచ్ తరఫున ఉపసర్పంచ్ షేక్ సాజీద్ స్పష్టం చేశారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA