Banswada: బాన్సువాడలో విద్యార్థులకు క్విజ్, వ్యాస రచన పోటీలు!
Banswada: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 9 మండలాలకు చెందిన 160 మంది విద్యార్థులకు క్విజ్, వ్యాస రచన పోటీలు నిర్వహించారు.
Banswada: బాన్సువాడలో విద్యార్థులకు క్విజ్, వ్యాస రచన పోటీలు!
బాన్సువాడ: బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ఈ రోజు విద్యార్థులకు క్విజ్,మరియు వ్యాస రచన పోటీలు నిర్వహించారు. భారత ఎన్నికల సంఘం (Election Commission of India) వారి ఆదేశాలు మరియు మార్గదర్శకాల మేరకు ఓటరు అవగాహన కార్యక్రమంలో భాగంగా బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు క్విజ్ మరియు వ్యాసరచన పోటీలను నిర్వహించారు.
ఈ పోటీలలో ఓటు హక్కు ప్రాముఖ్యత, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటర్ల పాత్ర, ఎన్నికల ప్రక్రియ, నైతిక ఓటింగ్ మరియు బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించాల్సిన విధానాలపై , మరియు విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువలను పెంపొందించడం, ఎన్నికల ప్రక్రియపై అవగాహన కల్పించడం, మరియు భవిష్యత్తులో బాధ్యతాయుతమైన ఓటర్లుగా తీర్చిదిద్దడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం అని ఆర్ డీ ఓ రవీందర్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ పరీక్షలకు బాన్సువాడ నియోజకవర్గం లోని 9 మండలాలనుండి 160 మంది విద్యార్థులు హాజరయ్యారు.




