Nizamabad: హైవేపై రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసుల ప్రత్యేక చర్యలు
Nizamabad: నాగ్‌పూర్ గేట్ హైవేపై తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు, ఎన్‌హెచ్ఏఐ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎల్లో రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు.
Nizamabad: హైవేపై రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసుల ప్రత్యేక చర్యలు
నిజామాబాద్: హైవేపై తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. నాగ్‌పూర్ గేట్ హైవేపై ప్రమాదాలు జరిగే ప్రాంతాలను పోలీసు అధికారులు పరిశీలించారు.ఏసీపీ ప్రకాశ్, సీఐ వినోద్, ఎస్. ఐ ఆరిఫ్‌తో పాటు ఇందల్వాయి టోల్ మేనేజర్ వీరబాబు, జాతీయ రహదారి మేనేజర్ సతీష్ ఘటనా ప్రాంతాన్ని సందర్శించి ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు.
వాహనదారులు అప్రమత్తంగా ఉండేందుకు హైవేపై ఎల్లో రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేయించారు. వాహనాల వేగాన్ని నియంత్రించడం, డ్రైవర్లను అప్రమత్తం చేయడం, రోడ్డు ప్రమాదాలను తగ్గించడం లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, నిర్ణీత వేగ పరిమితిలోనే వాహనాలు నడపాలని సూచించారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ జాగ్రత్తగా ప్రయాణించాలని పోలీసు అధికారులు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమం లో ఏసీపీ ప్రకాశ్, సీఐ వినోద్, ఎస్. ఐ ఆరిఫ్, ఇందల్వాయి టోల్ మేనేజర్ వీరబాబు, జాతీయ రహదారి మేనేజర్ సతీష్ తదితరులు పాలుగోన్నారు.




